కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
TeluguStop.com
కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
ఈ మేరకు ఈనెల 22న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.నిన్న తన తల్లి అనారోగ్యానికి గురి కావడంతో ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాలేదు.
ప్రస్తుతం ఆమె కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది.ఈక్రమంలో విచారణకు హాజరుకావడానికి కొంత సమయం కావాలంటూ అవినాశ్ రెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి వినతిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఎల్లుండి విచారణకు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
గౌతమ్ కృష్ణ అకిరా లకు ఆ స్టార్ డైరెక్టర్ అంటే ఇష్టమా..?