అవినాష్ రాసిన లేఖకు సీబీఐ నుండి ఇంకా బదులు రాలేదు..సజ్జల రామకృష్ణారెడ్డి

ముందు నుండి సీబీఐ విచారణ ( CBI )కు సహకరిస్తున్నారు.తల్లికి ఆరోగ్యం బాలేదు, తండ్రి జైలు లో ఉన్నాడు కనుక ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళాడు.

అవినాష్ రాసిన లేఖకు సీబీఐ నుండి ఇంకా బదులు రాలేదు.కేంద్ర బలగాలు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు.

కర్నూల్ ఎస్పీ సహకరించడం లేదని ఎవరు చెప్పారు.? సీబీఐ వాళ్ళు చెప్పరా.

?అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న రోజు డైవర్షన్ కోసం కేంద్ర బలగాలు అని ప్రచారం చేశారు.

అలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు మా పార్టీ కార్యకర్తలు అభిమానంతో వస్తారు.ఏంటి ఈ అన్యాయం అని అడగడానికి కార్యకర్తలు వస్తారు.

తల్లి ఆరోగ్యం బాలేకపోతే డ్రామా అంటున్నారు.దుర్మార్గం కదా.

ఇలాంటి ప్రచారం జరుగుతుంటే కడుపు మండదా.? రియల్ మీడియా పై దాడి ఎక్కడైనా జరిగిందా.

కరుడుగట్టిన యోల్లో మీడియా పై జరిగి ఉండొచ్చు.తప్పుడు వార్తలు వేస్తుంటే కొందరు అభిమానులు ఆవేశంలో రియాక్ట్ అయ్యి ఉంటారు.

మీడియా ముసుగులో యెల్లో మీడియా వాళ్ళు టిడిపి కార్యకర్తల్లా పని చేస్తున్నారు.సీబీఐ కు రాష్ట్ర పోలీసులకు ఏమీ చర్చలు జరిగాయో తెలీదు.

డిపార్ట్మెంట్ టూ డిపార్ట్మెంట్ చాలా జరుగుతాయి.అవినాష్ రెడ్డి ( Avinash Reddy )ఏమైనా పరారు అవుతున్నాడా.

శిక్ష పడి తప్పించుకుని తిరుగుతున్నాడా.?వారం రోజులు సమయం అడిగాడు.

ఇస్తారో వచ్చి తీసుకుని వెళ్తారో మాకేం తెలుసు.తీసుకుని వెళ్ళినా పోయేదేముంది.

తల్లికి కి కొడుకు అవసరం ఉంది కనుక వారం రోజులు సమయం కావాలని కోరారు.

చంద్రబాబు( Chandra Babu Naidu ) అధికారంలో ఉనప్పుడు రాష్ట్రంలోకి సీబీఐ నో ఎంట్రీ జీఓ తెచ్చాడు.

ఈరోజు గగ్గోలు పెట్టే వాళ్ళు ఆనాడు యెందుకు నోరెత్తలేదు.

పెళ్లి కూతురుగా ముస్తాబయి డాన్స్ ఇరగదీసిన శోభిత.. వీడియో వైరల్!