వివేకా హత్య కేసులో సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్‎షీట్ దాఖలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్‎షీట్ దాఖలు చేసింది.

ఈ మేరకు హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టులో కేసుకు సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ సమర్పించింది.

కాగా హత్య కేసులో దర్యాప్తునకు గడువు కూడా ఇవాళ్టితో ముగిసిన సంగతి తెలిసిందే.

అయితే విచారణకు మరికొంత సమయం కావాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ.

మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై వచ్చే నెల 3న విచారణ జరగనుంది.

హెయిర్ రూట్స్ ను సూపర్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ గా మార్చే బెస్ట్ టానిక్ మీ కోసం!