వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ వ్యవహార శైలి అంతుచిక్కని విధంగా తయారయింది .
మొదటి నుండి ఒక నిర్దిష్ట ప్రణాళికా లేకుండా వ్యవహరిస్తుందని కోర్టు చేత మొట్టి కాయలు తిన్నా కూడా కాలయాపన చేస్తూ ఆరోపణలు చేయటమే తప్ప దానికి తగ్గ సమగ్ర దర్యాప్తు జరపడం లేదేమో అన్న అనుమానం సర్వత్రా వినిపిస్తుంది.
ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్( YS Jagan Mohan Reddy ) పేరును కూడా అఫిడవిట్లో ప్రస్తావించడం సంచలనంగా మారింది.
వివేక హత్య జరిగిందని 6:15 నిమిషాలకు వివేకా పీఏ కృష్ణారెడ్డి ప్రపంచానికి వెల్లడి చేయకముందే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలుసని సిబిఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది.
హత్య జరిగిన రోజు తెల్లవారుజామున నాలుగు గంటల 11 నిమిషాలకు అవినాష్ రెడ్డి ఫోన్ వాట్సాప్ కాల్ యాక్టివ్ గా పని చేసిందని సుమారు గంటకు పైగా ఆయన రకరకాల వ్యక్తులతో చర్చలు చేశారని ముఖ్యమంత్రి కి కూడా సమాచారం వెళ్లిందని మాకు ప్రాధమిక ఆధారాలున్నాయంటూ సిబిఐ తెలపటం గమనార్హం.
"""/" / అంతేకాకుండా హత్య జరగిని రోజు ఒంటిగంటా 58 నిమిషాలకు సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లుగా అతని ఫోన్ సిగ్నల్ చూపిస్తున్నదని, విచారణ సమయంలో రకరకాల పొంతనలేని సమాధానం చెప్పి తప్పించుకోవాలనే ఆలోచన తోనే అవినాష్ ఉన్నారని ,రకరకాల కారణాలు చెప్తూ విచారణ కు కూడా హాజరవ్వడం లేదని ,అందు వల్ల ముదస్తూ బేయిల్ అభ్యర్థనను ను తిరస్కరించి కస్టోడియల్ విచారణ కు అనుమతి ఇస్తే తప్ప నిజా నిజాలు వెలికి తీయలేమని సిబిఐ కోర్టు కి విన్నవించింది .
ఈ నెల 22వ తారీకున ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నించినా కూడా ఆయన అనుచరులు శాంతి బద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని అందుకోసమే సహాయం కోసం కడప జిల్లా ఎస్పీని అభ్యర్థించామని అయితే అవినాష్ పులివెందులకు వెళ్లకుండా కర్నూలుకి వెళ్లిపోయారని సిబిఐ హైకోర్టుకు తెలిపింది.
"""/" / ఈ కేసు విచారణ ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగుతున్నా కూడా ఇంకా స్పెక్యులేషన్లకే సిబిఐ పరిమితం అవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అవినాష్ రెడ్డి పాత్ర( Y.S.
Avinash Reddy ) పై పూర్తిస్థాయి ఆధారాలు కోర్టుకు సమర్పించకుండానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాత్ర పై కొత్త వ్యాఖ్యలు చేయడం సిబిఐ విశ్వసనీయత పట్ల కూడా అనుమానం వస్తుంది .
ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల( Sajjala Ramakrishna Reddy ) ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు .
ఈనాడులో వచ్చే వార్తలను ఆధారంగా చేసుకుని సిబిఐ విచారణ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని, జగన్ కేంద్రంగా పెద్ద కుట్ర జరుగుతున్నట్లుగా తమకు అనుమానం ఉందని ఈ కుట్ర పూర్తి కోణాలను వెలికి తీస్తామని ఆయన ప్రకటించారు
.
వామ్మో, ఇదేం అద్భుతం.. 66 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!