జగన్ విచారణకు రావాలని సి‌బి‌ఐ కోర్టు ఆదేశం.. లేదంటే చర్యలు సిద్దం

జగన్ అక్రమ ఆస్తుల కేసులను విచారిస్తున్న సి‌బి‌ఐ ప్రత్యేక కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది.

వైసీపీ ఎం‌పి విజయ్ సాయి రెడ్డి కి, హేటిరో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి, అరబిందో, ప్రతినిధులు రాంప్రసాద్ రెడ్డి, నిత్యానంద రెడ్డి తో పాటుగా పలువురికి నోటీసులు అందించింది.

సోమవారం నాడు సి‌బి‌ఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావాలని తెలిపింది.అరబిందో, హేటిరో ఫార్మాలకు భూ కేటాయింపులు అంశంపై జగన్ అక్రమ ఆస్తుల కేసును విచ్చరిస్తున్న ఈ‌డి నాంపల్లి మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు లో గతంలో అభియోగ పత్రం ధాఖలు చేసింది.

నాంపల్లి కోర్టులోని కేసును సి‌బి‌ఐ కోర్టు కు అప్పజెప్పాలని జగన్ హై కోర్టులో పిటిషన్ ధాఖలు చేశాడు.

ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు నాంపల్లి కోర్టులోని ఆ కేసుల్ని సి‌బి‌ఐ కోర్టుకు అప్పజెప్పింది.

భూ కేటాయింపుల విచారణ సందర్భంగా సోమవారం నాడు జగన్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

తండ్రి అస్థికలు లాకర్‌లో భద్రపరచమని స్నేహితుడికి సలహా.. చైనాలో అంతే..?