ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ ఛార్జ్‌షీట్.. నిందితులపై కీలక అభియోగాలు
TeluguStop.com
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఈ క్రమంలో నిందితులపై కీలక అభియోగాలు చేసింది.లంచాలు, హవాలా మార్గంలో నగదును భారీగా తరలించారని సీబీఐ తెలిపింది.
అభిషేక్ బోయిన్ పల్లి రూ.30 కోట్ల నగదును హవాలా మార్గంలో తరలించారన్నారు.
డబ్బంతా అడ్వాన్స్ గా 2021 జూలై, సెప్టెంబర్ మధ్య ముట్టజెప్పారని ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
రూ.30 కోట్లను దినేశ్ అరోరా ద్వారా విజయ్ నాయర్ కు అందజేశారని, మద్యం ఉత్పత్తి దారులు తరపున అభిషేక్ వ్యవహారం నడిపారని అభియోగం మోపారు.
సౌత్ గ్రూపును శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగంట శ్రీనివాస్ రెడ్డి కంట్రోల్ చేశారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.
ఈ క్రమంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్ ను సీబీఐ కోర్టు ఆమోదించింది.
రిషబ్ శెట్టి కాంతార2 మూవీకి మరో భారీ షాక్ తగిలిందా.. అసలేం జరిగిందంటే?