చిక్కుల్లో చినబాబు ? ఆ అవినీతి పై సీబీ ‘ఐ’ ?

టీడీపీలో కీలక వికెట్లు ఒక్కొక్కటిగా పడుతున్నాయి.ఇప్పటికే చాలామంది నాయకులు పార్టీని వీడి, ఇతర పార్టీలో చేరిపోగా, మరికొంతమంది రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.

ఇక మరి కొంతమంది అనేక అవినీతి వ్యవహారాల్లో జైలు జీవితం గడుపుతుండగా, మరికొంతమంది బెయిల్ పై బయటకు వచ్చారు.

ఇక ఇప్పుడు ఆ వరుసలో టీడీపీ యువ నాయకుడు, మాజీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు లోకేష్ విషయంలో సైలెంట్ గానే ఉన్నట్టుగా కనిపించారు.ఏపీ ప్రభుత్వం ఇక ఆయన అవినీతి వ్యవహారాలపై సీబీఐ ను రంగంలోకి దించి, లోకేష్ ను జైలుకు పంపించాలనే అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ 2014-19 మధ్య జరిగిన అవినీతిపై విచారణ చేయించాలని, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ను కోరింది.

ఇప్పటికే ఈ వ్యవహారంపై మంత్రివర్గ ఉప సంఘం విచారణ చేసి, భారీ ఎత్తున అవినీతి జరిగిందని, సుమారు 2000 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు నిర్ధారించింది.

గత టీడీపీ ప్రభుత్వం లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వ్యవహారంలో ఉన్నారని, వారి ప్రోద్బలంతోనే భారీగా అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది.

టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కు భారత్ బ్రాండ్ నెట్వర్క్ లిమిటెడ్ కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్వర్క్ మధ్య అవగాహన ఒప్పందం జరిగిన వ్యవహారం లో భారీ అవినీతి జరిగిందని, అప్పటి ప్రభుత్వ సాంకేతిక సలహాదారు కృష్ణప్రసాద్ అవినీతి లో భాగస్వామి గా ఉన్నారని, ఇప్పటికే ఏపీ కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది.

అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ, పాలన అనుమతులు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా 11.

26 శాతం అదనంగా టెండర్లు ఖరారు చేసినట్లుగా గుర్తించింది.ఈ అవినీతి వ్యవహారాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉండడంతో లోకేష్ చుట్టూ జగన్ ఉచ్చు బిగించేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

 ఇదే వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించడం వెనుక జగన్ వ్యూహాత్మక ఎత్తుగడ అర్థం అవుతోంది.

ఇప్పటికే ఏపీ బిజెపి నాయకులు టీడీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలను విచారణ చేయించాలని, చంద్రబాబుపై విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ తరుణంలో కేంద్రం మద్దతు కూడా లభిస్తుందని జగన్ అభిప్రాయపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.మరికొద్ది రోజుల్లోనే ఈ వ్యవహారంపై సీబీఐ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

Kadiyam Srihari : రేపు కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి