ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సీబీఐ..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha )కు మరో షాక్ తగిలింది.

ఈ మేరకు కవితను సీబీఐ అరెస్ట్ చేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(( Delhi Liquor Scam Case )లో కవితను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ మేరకు తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది.

కాగా కవితను రేపు సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది.ఇప్పటికే తీహార్ జైలు( Tihar Jail )లో ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలోనే కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది.అయితే ఇప్పటికే ఇదే కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా ఆమె తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

అక్కడ ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉపాసన.. ఎంతో సంతోషంగా ఉందంటూ?