కడప ఎంపీ అవినాశ్, భాస్కర్ రెడ్డికి సీబీఐ మరో ఛాన్స్..!

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు మరో అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.

ఇవాళ విచారణకు హాజరుకాలేమన్న లేఖపై సానుకూలంగా స్పందించారు అధికారులు.ఈ క్రమంలోనే ఎంపీ అవినాశ్ విచారణను పదో తేదీకి వాయిదా వేశారు.

అదేవిధంగా భాస్కరరెడ్డిని ఈనెల 12వ తేదీన రావాలని తెలిపారు.అయితే ఇవాళ విచారణకు రమ్మంటూ సీబీఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందును మరో తేదీ హాజరు అవుతానంటూ అవినాశ్ అధికారులను కోరారు.

ఈ క్రమంలో అనినాశ్ రాసిన లేఖపై సీబీఐ స్పందించింది.కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు వీరిని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

ఒకటి రెండు ప్లాప్ లు వచ్చిన రామ్ చరణ్ కి ఇబ్బంది లేదా..?