ఆ ఐఫోన్ ఖరీదు కోటి రూపాయలు… రోలెక్స్ రీ మోడల్ ఇదే!
TeluguStop.com
ఆశ్చర్యంగా వుంది కదూ.మీరు విన్నది నిజమే.
పోనీ ఎంత ఐఫోన్ ఐతే మాత్రం కోటి రూపాయిలు పలుకుతుందా? అని అనుమానం కలగక మానదు.
మీ అనుమానం నిజమే.ఎటువంటి యాపిల్ ఐఫోన్ ధర అయినా రూ.
60వేల నుండి 70వేల మధ్యలో ఉంటుంది.ఇంకా మహాకాకపోతే ఓ లక్ష రూపాయిలు ఉంటుంది.
కానీ కోటి రూపాయిలంటే ఎవరికన్నా ఒకింత అనుమానం కలగక మానదు.కానీ ఇక్కడ చెప్పే ఈ యాపిల్ ఐ ఫోన్ యొక్క ధర మాత్రం దాదాపు రూ.
కోటికి పైగా ఉంది.అయితే దానికి వున్న ప్రత్యేకత గురించి ఇపుడు తెలుసుకుందాము.
ప్రముఖ రష్యన్ లగ్జరీ బ్రాండ్ కేవియర్ Apple IPhone 14 Pro ప్రత్యేక ఎడిషన్‌ను తాజాగా విడుదల చేసింది.
దీని కళ్ళు చెదిరే ధర తెలిస్తే షాక్ అవుతారు.అవును, దాని ధర అక్షరాలా 1,33,670 డాలర్లు.
అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1.
1 కోట్లు.ఇక ఇంత కాస్ట్ చెప్పడానికి బలమైన కారణం వుంది.
ఈ ఫోన్ కు వెనుక భాగం ప్యానెల్‌పై .రోలెక్స్ వాచ్‌ను పొందరుపరచడం కొసమెరుపు.
అంతేకాకుండా ఈ వాచ్ లో 8 వజ్రాలతో పాటు బంగారు కలర్ లో రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఉందని కంపెనీ తన డిస్క్రిప్షన్లో పేర్కొంది.
అయితే ఈ గోల్డెన్ రోలెక్స్ డేటోనా వాచ్‌ను కలిగి ఉన్న ఐఫోన్ 14 ప్రో మోడల్స్ పరిమిత సంఖ్యలో మాత్రమే తయారు చేసారు.
"""/"/కాబట్టి సంపన్నులు ఎవరన్నా ఉంటే మాత్రం, ఇప్పుడు బుక్ చేసుకుంటే ఉత్తమం.
లేదంటే ఎవరో ఒకరు ఎగరేసుకుపోతారు.ఇవి చూడటానికి చాలా సెక్సీగా వున్నాయి.
ఫొటోని గమనిస్తే మీరు అర్ధం అవుతుంది.కేవలం 3 యూనిట్లు మాత్రమే రోలెక్స్ వాచ్‌తో తయారు చేయబడ్డాయి.
ఈ లిమిటెడ్ ఎడిషన్ IPhone 14 Pro మార్కెట్‌లోని ప్రొఫెషనల్ కార్ రేసింగ్ అభిమానులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రారంభించబడింది.
దీనిలో 18K బంగారం, నగల ఎనామెల్, డ్యాష్‌బోర్డ్ స్విచ్‌లు, 1930 నాటి డేటోనా రేస్ కారు కంట్రోల్ ప్యానెల్ నుండి తీసిన అలంకార వస్తువులు ఈ ఫోన్‌కి జోడించబడ్డాయి.
అఖిల్ కెరియర్ ఎటు పోతుంది..? 10 సంవత్సరాల్లో ఆయన సాధించిన సక్సెస్ సినిమాలు ఎన్ని..?