భార్య ఫోన్‌లో వేరే వ్యక్తి పంపిన వాట్సాప్ మెసేజ్ చూశాడు ఆ భర్త… తరువాత ఏమైందో తెలుసా..?
TeluguStop.com
దంపతుల్లో ఆడ, మగ ఎవరైనా తమ జీవిత భాగస్వామిని వదిలిపెట్టి వేరే వారితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే అవి చివరకు విషాదానికే దారి తీస్తాయి.
మనం ఇది వరకు ఇలాంటి అనేక సంఘటనలను చూశాం.అయినప్పటికీ ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం ఆపడం లేదు.
సరే.అందుకు దంపతులు చెప్పే కారణాలు అనేకం ఉంటాయనుకోండి, అవి వేరే విషయం.
అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా సరిగ్గా ఇలాంటి ఓ ఘటన గురించే.
ఓ మహిళకు వేరే వ్యక్తితో ఉన్న సంబంధం గురించి ఆమె భర్తకు తెలిసింది.
దీంతో అతను ఆమెను నిలదీశాడు.ఆ తరువాత ఆమె భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన జరిగింది జార్ఖండ్‌లో.జార్ఖండ్ లోని ధన్‌బాద్ అనే ప్రాంతంలో ఉన్న నవాది అనే ఏరియాలో షంపా మాలిక్ అనే మహిళ తన భర్తతో కలిసి స్థానికంగా మనోరమ్ వాటిక అనే ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది.
వీరికి 2011లో వివాహం కాగా 4 ఏళ్ల వయస్సున్న ఓ కుమారుడు ఉన్నాడు.
అయితే ఈమె భర్త స్థానికంగా ఉన్న పోస్ట్ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు.ఈ క్రమంలోనే అతను రోజూ ఉదయం ఆఫీస్‌కు వెళ్లి, తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు.
అయితే భర్త లేని సమయంలో షంపా తన ప్రియుడు సౌరభ్ చౌదరిని ఇంటికి రప్పించుకునేది.
అతనితో సరదాగా ఉండేది.వీరిద్దరికీ ఓ మొబైల్ స్టోర్‌లో పరిచయం కాగా అప్పుడే వీరి తమ ఫోన్ నంబర్లను షేర్ చేసుకున్నారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఆ తరువాత నుంచి షంపాకు, సౌరభ్‌కు మధ్య మాటలు ఎక్కువయ్యాయి.
వారు గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుకునేవారు.వాట్సాప్‌లో సంభాషణలు జరిపే వారు.
ఇదంతా షంపా తన భర్తకు తెలియనిచ్చేది కాదు.కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.
అది మనకు ఒక్కోసారి టైం ఇవ్వదు.దీంతో ఆ సమయంలో మనం అనుకున్నది కాకుండా వేరేది జరుగుతుంది.
సరిగ్గా షంపాకు కూడా ఇలాగే జరిగింది.భర్త తన ఫోన్‌ను చూడడం లేదు అని ఆమె భ్రమపడింది.
కానీ ఓ రోజు అతను ఆమె ఫోన్ చూశాడు.తన ప్రియుడితో ఆమె జరిపిన వాట్సాప్ సంభాషణలను, వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని అతను తెలుసుకున్నాడు.
దీంతో వెంటనే అతను షంపాను నిలదీశాడు.అయితే ఆమెకు ఏం చేయాలో తెలియలేదు.
భర్తతో వాదించింది.కానీ షంపా భర్త మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకున్నాడు.
తన భార్య విషయాన్ని ఇరుగు పొరుగు వారికి చెప్పాడు.అనంతరం ఆమె తల్లిదండ్రులకు విషయం ఫోన్ చేసి చెప్పాడు.
ఇది చూసిన షంపా నామోషీగా ఫీల్ అయ్యింది.అంతే.
వెంటనే తమ అపార్ట్‌మెంట్ లో 6వ అంతస్తు పై వరకు ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలో వారు సౌరభ్‌ను అరెస్ట్ చేశారు.
అయితే షంపా చనిపోయిన తరువాత రెండు, మూడు రోజుల వరకు సౌరభ్‌కు ఆ విషయం తెలియలేదు.
దీంతో అతను రోజూ చాట్ చేసినట్టుగానే ఆమెకు మెసేజ్‌లు పెట్టాడు.పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
అవును మరి, వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే ఎవరికైనా చివరకు ఇలాంటి గతే పడుతుంది.