బైకర్‌ను గుద్దిన ఎస్‌యూవీ.. షాకింగ్ యాక్సిడెంట్ వీడియో వైరల్!

రోడ్లపై వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి.ఏ తప్పు చేయకపోయినా అవతలి వారి నిర్లక్ష్యం వల్ల ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో ఎందరో చనిపోతున్నారు.

కాగా తాజాగా ఒక బైకర్ తన సిస్టర్ పెళ్లికి వెళ్తూ ఉండగా ఒక ఎస్‌యూవీ శరవేగంగా వచ్చి అతన్ని ఢీ కొట్టింది.

ఈ ఘటన బిహార్‌లోని జాముయి జిల్లాలో చోటు చేసుకుంది.వేగంగా వస్తున్న ఎస్‌యూవీ బైక్‌పైకి దూసుకెళ్లడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది.ఆ వీడియో వైరల్‌గా మారింది.

బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఎస్‌యూవీ వాహనం ఢీకొనడంతో ఆ బైకర్ 10 అడుగుల ఎత్తులో ఎగిరిపడ్డాడు.

అప్పుడు అతడికి తీవ్ర గాయాలయ్యాయి.దాంతో స్పాట్ డెడ్ అయ్యాడు.

మృతుడు రాజేంద్ర మహ్తో కుమారుడు అజీత్‌గా గుర్తించారు.ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

ఆ మరో వ్యక్తి కూడా ఇదే బైక్ పై ప్రయాణిస్తున్నాడు.అతడు కూడా చాలా ఎత్తు ఎగిరి కింద పడ్డాడు.

ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. """/"/ సీసీటీవీ వీడియో ప్రకారం ఈ ఘటన డిసెంబర్ 8న ఉదయం 6:30 గంటలకు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఎస్‌యూవీ కారు బైకర్‌ను ఢీ కొట్టిన తర్వాత అక్కడ నుంచి పరార్ అయింది.

స్థానికులు దీన్ని వెంబడిస్తూ రాళ్లు కూడా విసిరారు.ఏదేమైనా ఆ డ్రైవర్ రాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల అన్యాయంగా ఒక నిండు ప్రాణం బలయింది.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

వైరల్: అసలైన బాలయ్య అంటే ఇది.. అభిమానులతో కలిసి..