షాకిస్తున్న పిల్లులపై పరిశోధనలు.. ఆశ్చర్యపోతున్న శోధనకర్తలు!
TeluguStop.com
ఇటీవల పిల్లులపై జరిగిన పరిశోధనలో అవి మనుషులను అనుకరిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.అవి వివిధ రకాలుగా మనుషులతో సంభాషిస్తాయని తేలింది.
నూతన అధ్యయనంలో శాస్త్రవేత్తలు.పిల్లులు వాటి పేర్లను గుర్తించడమే కాకుండా, ఇతరుల పేర్లను కూడా గుర్తించగలవని కనుగొన్నారు.
ఈ అధ్యయనంలో పిల్లులు వాటి పేర్లతో పాటు ఇతర పిల్లుల పేర్లను గుర్తిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
అలాగే ఇంటి సభ్యుల పేర్లను కూడా గుర్తిస్తాయట.ఇది వింతగా అనిపిస్తుంది.
కుక్కలకు వివిధ పేర్లను గుర్తుంచుకునేలా శిక్షణ ఇచ్చారు.ఇప్పుడు పిల్లులకు శ్రవణ సామర్థ్యం ఉందని తేలింది.
జపాన్‌లోని అజుబా యూనివర్శిటీలో జంతుశాస్త్ర పరిశోధకుడు సాహో తకాగి బృందం తాము కనుగొన్నది అద్భుతమని అభిప్రాయపడ్డారు.
ఆయన మాట్లాడుతూ “ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.పిల్లులు మనుషుల మాటలు వింటాయన్నారు.
ప్రయోగాలలో తకాగి, అతని తోటి పరిశోధకులు దేశీయ, ఇతర వాతావరణాలలో నివసించే పిల్లులపై అధ్యయనం చేశారు.
జపాన్‌లోని క్యాట్ కేఫ్‌లలో పిల్లులు మనుషులతోపాటు కలిసి నివసిస్తాయి.ఈ ప్రయోగంలో పరిశోధకులు.
పిల్లులకు.కంప్యూటర్ స్క్రీన్‌పై ఫొటోలను ఒక్కొక్కటిగా చూపించి, వాటిని గుర్తించే ఏర్పాట్లు చేశారు.
ఫొటోతో పాటు, వాటి యజమాని వాయిస్, చిత్రంలో ఉన్న పిల్లి పేరు (వాయిస్ మరియు ఫేస్) కూడా వాటికి కనిపించేలా చేశారు.
అదే సమయంలో వేరే పిల్లి పేరు కూడా పిలవడం వినిపించారు.పెంపుడు పిల్లులు కంప్యూటర్ స్క్రీన్‌లను చూస్తూ ఎక్కువ సమయం గడిపాయని పరిశోధకులు కనుగొన్నారు.
ఎందుకంటే అవి ఫొటో, పేరు మధ్య కాస్త గందరగోళాన్ని ఎదుర్కొన్నాయి.క్యాట్ కేఫ్‌లోని పిల్లులు ప్రయోగం సమయంలో చాలా అంశాలను గుర్తించాయి.
అధ్యయనంలో శాస్త్రవేత్తలు కొత్త విషయాలను కనుగొన్నారు.ఈ పిల్లులు తమ వాతావరణంలో పెద్ద సంఖ్యలో పిల్లులలో నివసించడం కూడా ఇదే కారణం కావచ్చని గుర్తించారు.
అందుకే అవి ఎంచుకున్న పిల్లితో ఎక్కువ సమయం గడుపుతాయని గ్రహించారు.పెంపుడు పిల్లులు.
ఒక నిర్దిష్ట పిల్లి పేరు విన్న తర్వాత దాని ముఖాన్ని గుర్తించగలవని పరిశోధకులు తమ రిసెర్చ్ పేపర్‌లో రాశారు.
భగవంత్ కేసరి, డాకు మహరాజ్ బాలయ్య రెండు సినిమాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రొడ్యూసర్లు…కారణం ఏంటి..?