బాబాయితో పాటు అబ్బాయిని కూడా ముగ్గులోకి దించిన బ్యూటీ

తెలుగులో హీరోయిన్‌లుగా తమ కెరీర్‌ను కొనసాగించాలంటే ఎలాంటి పాత్రలకైనా సిద్ధంగా ఉండాలనేది వాస్తవం.

కానీ హీరోల విషయంలో వారికి నచ్చకపోయినా సినిమాలు చేయాల్సి వస్తుంది.ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్‌తో పాటు వారి ఫ్యామిలీకి చెందిన హీరోలతో సైతం హీరోయిన్లు రొమాన్స్ చేస్తూ కనిపిస్తారు.

తెలుగు ఇండస్ట్రీలో తండ్రీకొడుకులు, బాబాయి అబ్బాయిలతో ఒకే హీరోయిన్ రొమాన్స్ చేయడం కామన్ విషయం అయిపోయింది.

తాజాగా ఇదే కోవలోకి కేథరిన్ త్రెసా కూడా వచ్చి చేరింది.ఇప్పటికే నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రానున్న సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో బాలయ్యతో రొమాన్స్‌కు కేథరిన్ ఎంపిక కావడానికి ముఖ్య కారణం బోయపాటి శ్రీను అని తెలుస్తోంది.

బోయపాటి గత సినిమాల్లోనూ ఈ అమ్మడు నటించిన సంగతి తెలిసిందే.కాగా తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించబోయే నెక్ట్స్ మూవీలో కూడా కేథరిన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

""img "aligncenter" Src="" / కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఎంత మంచివాడవురా అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని వేణు మల్లిడి అనే కొత్త దర్శకుడి డైరెక్షన్‌లో నటించనున్నాడు.

ఈ సినిమాకు ‘రావణ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఓ భిన్నమైన పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది.ఏదేమైనా బాబాయి బాలకృష్ణతో పాటు అబ్బాయి కళ్యాణ్ రామ్‌ సినిమాలను ఒకేసారి ఓకే చేసిన కేథరిన్ ఈ సినిమాల్లో ఎలాంటి పాత్రల్లో కనిపిస్తుందో చూడాలి.

అందాల ఆరబోతకు ఎంతమాత్రం వెనుకాడని ఈ బ్యూటీని ఆయా చిత్రాల దర్శకులు ఎంతవరకు వినియోగించుకుంటారో చూడాలి.

రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారు..: హరీశ్ రావు