సిక్స్ ప్యాక్ కోసం తెగ ట్రై చేస్తున్న పిల్లి.. వీడియో వైరల్ .
TeluguStop.com
ఇవాళ రేపు ప్రతి ఒక్కరూ కూడా ఫిట్ గా ఉండాలని తెగ ప్రయత్నిస్తుంటారు.
అందుకోసం నానా తిప్పలు పడుతున్నారు.జిమ్ లలో గంటలు గంటలు ఉంటూ బాడీ ఫిట్ నెస్ ను పెంచుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు.
అయితే ఇప్పుడు ఈ ఫిట్ నెస్ ఫీవర్ వారు పెంచుకునే జంతువులకు కూడా అంటుకుంటోంది.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన వీడియోలు మనం అనేకం చూస్తున్నాం.ఓనర్లు పెంచుకునే పెంపుడు జంతువులు కూడా యజమానులు చేసినట్టు ఫీట్లు చేస్తుండటం మనం చూస్తున్నాం.
ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఓ పిల్లి కూడా ఫిట్ నెస్ కోసం తెగ ప్రయత్నిస్తోంది.
దీని విన్యాసాలు మామూలుగా లేవంటే నమ్మండి.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది.
దాన్ని చూసిన వారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు.ఈ మధ్య యజమానులు తాము జిమ్ లకు వెళ్లినా లేదంటే ఇంకేదైన ప్లేస్‌కు వెళ్లి ఫిట్ నెస్ కోసం వ్యాయామాలు చేసే దగ్గరకు తమ పెంపుడు కుక్కలను లేదంటే పిల్లిని తీసుకెళ్లడం మనం చూస్తున్నాం.
ఇక అవి తమ యజమానులు చేసినట్టు చేసి నవ్వులు పూయిస్తున్నాయి. """/" /
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఓ పిల్లి ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ తెగ కష్టపడుతోంది.
తానెందుకు ఫిట్‌గా ఉండొద్దు అనుకుందో ఏమో గానీ తెగ వ్యాయామాలు చేసేస్తోంది.ఓ చోట ఎంచక్కా పడుకుని మరీ పుష్ అప్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంది.
అసలే బయట కొవిడ్ మహమ్మారి ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఫిట్ గాఉండాలి అనుకుందో ఏమో అన్నట్టు తెగ విన్యాసాలు చేస్తోంది.
దీన్నంతా కూడా వీడియో తీయగా దీనిపై నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు.మనం కూడా ఇలా కష్టపడితే బాగుండు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 7, సోమవారం 2025