విమానం కాక్ పిట్ లోకి ప్రవేశించిన పిల్లి.. చివరకి..?!

విమానాల్లో, హెలికాప్టర్లలో పిల్లులు ప్రత్యక్షమవడం మనం ఎన్నో సార్లు వీడియోల్లో చూసాం.ఐతే విమానాల లోపలకి ఏ జంతువు ని రాకుండా అధికారులు జాగ్రత్త పడతారు కానీ పిల్లులను మాత్రం అసలు ఆపలేరు.

సుడాన్‌ విమానాశ్రయ అధికారులు కూడా ఒక పిల్లి విమానంలోని కాక్ పిట్ లో చొరబడడాన్ని కనిపెట్టలేకపోయారు.

దీంతో ఆ పిల్లి విమానం లో ఉండగానే అది టేకాఫ్ అయింది.కొంతదూరం వెళ్ళగానే ఆ పిల్లి వెంటనే బయటకు వచ్చి నానా బీభత్సం సృష్టించింది.

అయితే విమానాశ్రయ అధికారులు ఆ పిల్లిని పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ అది ఎవరికీ దొరకకుండా ఆఖరికి పైలెట్ పై దాడి చేసింది.

దీంతో ఒక్కసారిగా షాక్ అయిన పైలెట్.ఈ పిల్లిని త్వరగా విమానం నుంచి దించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని భయపడి వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

అయితే పిల్లి చాలాసేపు సృష్టించిన బీభత్సానికి లోపల ఉన్న ప్రయాణికులు కూడా భయభ్రాంతులకు గురి అయ్యారు.

"""/"/ పూర్తి వివరాలు తెలుసుకుంటే.టార్కో ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 సుడాన్‌లోని ఖార్టూమ్ నుండి ఖతార్ రాజధాని నగరమైన దోహాకు బయలుదేరింది.

అయితే ఆ విమానంలో పిల్లి ఉందన్న విషయం తెలియని పైలెట్ దోహా నగరానికి ప్రయాణికులను చేరవేయడానికి విమానాన్ని టేక్ ఆఫ్ చేశారు.

ఇంతలోనే పిల్లి ప్రత్యక్షమై పైలెట్ పై దాడి చేసింది.దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి ఖార్టూమ్ లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

అయితే ఈ పిల్లి విమానంలోకి ఎలా వచ్చిందో అనే విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రయాణానికి ముందు రోజు ఒక హ్యాంగర్ వద్ద విమానాన్ని ఉంచారని.బహుశా అదే సమయంలో పిల్లి దొంగతనంగా విమానంలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు.

లేదా ఇంజనీర్లు విమానాన్ని చెక్ చేసే సమయంలో పిల్లి వచ్చి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

క్లీన్ చేసే సమయంలో కూడా పిల్లి విమానం లోపలికి ప్రవేశించే అవకాశం ఉన్నదని కొందరు అంటున్నారు.

ఏది ఏమైనా పిల్లి సృష్టించిన ఈ గందరగోళంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు.

దీంతో అక్కడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మీ కారు ఎప్పుడూ రిపేరు అవుతోందా.. కారు లైఫ్ పెంచే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!