మొటిమ‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను సులువుగా పోగొట్టే ఆముదం!

నేటి త‌రం యువ‌తీ,యువ‌కుల‌ను వేధించే ప్ర‌ధాన చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఉంటాయి.

ఎంత తెల్ల‌గా ఉన్నా.మొటిమ‌లు, మ‌చ్చ‌లు వ‌చ్చాయంటే అందాన్ని మొత్తం నాశ‌నం చేస్తాయి.

అందుకే ఈ స‌మ‌స్య‌ల‌ను ఎలాగైనా న‌యం చేసుకోవాల‌ని నానా తిప్ప‌లు ప‌డుతుంటారు.మార్కెట్‌లో దొరికే ఏవేవో కెమిక‌ల్ ప్రోడెక్ట్స్‌ను ఉప‌యోగిస్తుంటారు.

అయితే మొటిమ‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను సులువుగా పోగొట్ట‌డంలో ఆముదం అద్భుతంగా ప‌నిచేస్తుంది.అందుకు ముందుగా ఆముదంలో కొద్దిగా ప‌సుపు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు, మ‌చ్చులు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి.పావు గంట త‌ర్వాత గోవెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల క్ర‌మంగా మొటిమ‌లు, మ‌చ్చలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.ఇక ఆముదంతో మ‌రిన్ని సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

ఆముదంలో కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

బాగా ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం ముడ‌త‌లు పోయి.

య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మారుతుంది.అలాగే ఆముదంలో కొద్దిగా బియ్యంపిండి మ‌రియు నిమ్మ‌ర‌సం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.ఇర‌వై నిమిషాల‌ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం లో ఉన్న మృత‌క‌ణాలు పోయి.ముఖం అందంగా, మృదువుగా మారుతుంది.

కేరళ బుడ్డోడు అల్టిమేట్ డిమాండ్.. బిర్యానీ కోసం మొండికేస్తే, ప్రభుత్వం దిగొచ్చింది!