హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని సర్వం దోచేశాడు... చివరికి
TeluguStop.com
ప్రస్తుత కాలంలో ఎంతో మంది యువత కోటి ఆశలతో తమ టాలెంట్ నిరూపించుకున్నని సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవడానికి నిత్యం చాలామంది సినిమా ఇండస్ట్రీకి వస్తుంటారు.
అయితే ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ కొందరు మోసం చేస్తున్నారు.ఇందులో భాగంగా కొంతమంది డబ్బు నగలు దోచుకుని ఉంటే మరి కొందరు మాత్రం వారి శీల, మానాలతో చెలగాటమాడుతున్నారు.
వివరాల్లోకి వెళితే ముంబాయి ప్రాంతానికి చెందిన ఓ యువతి సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి వచ్చింది.
ఇందులో భాగంగా అవకాశాల కోసం నిత్యం తీవ్రంగా శ్రమిస్తుంది.అయితే ఆమె శ్రమని అవకాశంగా తీసుకున్నటువంటి ఓ కాస్టింగ్ డైరెక్టర్ తనకు సినిమా పరిశ్రమలో చాలా మంది దర్శకులు నిర్మాతలు తెలుసని కచ్చితంగా అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికాడు.
దీంతో ఆ యువతి అతడిని నమ్మింది.అలాగే అతడికి సర్వం అర్పించింది.
దీంతో అవకాశాల పేరుతో వారిద్దరూ ఏకాంతంగా గడిపిన సమయంలో తీసుకున్నటువంటి కొన్ని ఫోటోలను తన వద్ద ఉంచుకొని క్యాస్టింగ్ డైరెక్టర్ వేధించ సాగాడు.
ఇందులో భాగంగా యువతిని డబ్బు, నగలు ఇవ్వాలంటూ నిత్యం ఒత్తిడి చేసేవాడు. """/"/
దీంతో పరువు గురించి ఆలోచించిన యువతి అందిన చోటల్లా అప్పులు చేసి దాదాపుగా 3 లక్షల రూపాయలు ముట్టజెప్పింది.
అయినా ఆ క్యాస్టింగ్ డైరెక్టర్ ధన దాహం తీరక పోవడంతో మరింత కావాలంటూ వేధించాడు.
అలాగే యువతి ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దీంతో యువతి ఏం చేయాలో తెలియక దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించింది.
వెంటనే రంగంలోకి దిగిన టువంటి పోలీసులు క్యాస్టింగ్ డైరెక్టర్ ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు.
అంతేగాక ఈ నేరానికి తన తోటి క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా సహాయం చేశాడని చెప్పడంతో అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే సినిమాల్లో నటించడం కోసం ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు కానీ ఇలా అవకాశాల పేరుతో లొంగ తీసుకునే వారి మాటలు నమ్మొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అంతేగాక ఒకవేళ ఇలాంటి సంఘటనలు మీకు ఎదురైతే పోలీసులకు తెలపాలని, సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా తెలియజేశారు.
విడాకులు పెరగడానికి కారణం ఆడవాళ్లే.. సరస్వతీ ప్రదీప్ షాకింగ్ కామెంట్స్ వైరల్!