కర్నాటక “క్యాస్ట్ పాలిటిక్స్ ” !

ఎన్నికలు వస్తున్నాయంటే ఏ పార్టీ అయిన కుల రాజకీయాలకు( Caste Politics ) తెరతీయడం సర్వసాధారణం.

కులసమీకరణల ఆధారంగానే ఏదైనా ఒక పార్టీ గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి.ఇందుకు కర్నాటక ( Karnataka ) మినహాయింపు కాదు.

ఇంకా చెప్పాలంటే కన్నడ నాట ఈ కుల రాజకీయాలు మరింత ఎక్కువే అని చెప్పాలి.

రాష్ట్రంలో అధిక శాతం ఉన్న కుల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.

ముఖ్యంగా కర్నాటకలో లింగాయత్, వోక్కలిగ, ఓబీసీ, ముస్లిం వర్గాలకు సంబంధించిన ఓటు బ్యాంకే అత్యంత కీలకం.

"""/" / కర్నాటకలో అధిక భాగం ఉన్న ఈ కూలలే గెలుపుఓటములను డిసైడ్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ముఖ్యంగా అధికార బీజేపీ ( BJP ) కుల సమీకరణలు చేయడంలో ముందు వరుసలో ఉంది.

హిందూత్వం, జాతీయ వాదాన్నే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్న కాషాయ పార్టీ.

లింగాయత్, బ్రహ్మనుల ఓటు బ్యాంకు పై కూడా గట్టిగానే కన్నెసింది.ఈసారి లింగాయత్ ఓటర్లను ఆకర్శించేందుకు ఏకంగా 51 మంది లింగాయత్ వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దించింది.

ఇక బ్రహ్మనుల ఓటు బ్యాంకు బీజేపీని కాదని ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం లేదనేది కమలనాథుల ధీమా.

ఇక హిందూత్వాన్ని ప్రదాన్యత ఇచ్చే వారు కూడా బీజేపీ వైపే చూస్తారనేది కమలనాథుల వ్యూహం.

"""/" / అందుకే ఆయా వర్గాల వారికి అభ్యర్థులను బరిలో ఉంచి కుల ఓటు బ్యాంకును పూర్తి స్థాయిలో కొల్లగొట్టాలని బీజేపీ చేస్తోంది.

ఇక కాంగ్రెస్ ( Congress ) విషయానికొస్తే.అన్నీ వర్గాలకు సరైన ప్రదాన్యత కల్పిస్తూ అభ్యర్థులను బరిలోకి దించింది.

కులాల వారీగా బీజేపీపై ఉన్న వ్యతిరేకతనే తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చూస్తోంది హస్తం పార్టీ.

ఇకపోతే జేడీఎస్ పార్టీ వోక్కలిగ ఓటు బ్యాంకునే అధికంగా నమ్ముకుంది.లింగాయత్ తరువాత 15 శాతం ఈ వర్గానికి చెందిన ఓటర్లే ఉండడంతో వోక్కలిగ పైనే జేడీఎస్ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.

అలాగే ఓబీసీ, లింగాయత్ లో కూడా ఎంతో కొంత ఓటు షేర్ తమకు వచ్చే అవకాశం ఉందని జేడీఎస్ ( JDS ) భావిస్తోంది.

ఇలా మూడు ప్రధాన పార్టీలు కూడా తమ తమ వ్యూహాలతో కుల ప్రతిపాధికన ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

మరి క్యాస్ట్ పాలిటిక్స్ ఏ పార్టీకి ఫేవర్ గా మారతాయో చూడాలి.

మహేష్ బాబులో నమ్రతకు నచ్చని క్వాలిటీ అదేనా.. ఆ పని చేస్తే అస్సలు ఒప్పుకోదా?