కుల సంఘాల అభివృద్ధి కి కుల కార్పోరేషన్లు ఎంతగానో దోహదపడుతాయి
TeluguStop.com
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా :కుల సంఘాల అభివృద్ధి కి కుల కార్పోరేషన్లు ఎంతగానో దోహదపడుతాయని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య అన్నారు.
వివిధ కుల సంఘాలు కార్పోరేషన్ల ను ఏర్పాటు చేయాలని ఎన్నో ఎండ్ల నుంచి ఎదిరిచూస్తన్న కార్పోరేషనలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 కులాలకు కార్పోరేషన్ల ను మంజూరు చేయడం సంతోషకరమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కుల సంఘాలు రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని హర్షిస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
ఆయన రైతు కుటుంబం నుంచి ఎదిగిన రాజకీయ నాయకుడని అందుకే కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలు కొన్ని కుల సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని వాటిని గమనించాలని ఆయన వివిధ కుల సంఘాలకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు షేక్ గౌస్ బాయి మాట్లాడుతూ కార్పొరేషన్ల వల్ల తమ పిల్లల భవిష్యత్తుకు మేలు చేకూరుతుందని 16 కుల సంఘాలకు ఓకేసారి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణమని ఇది రేవంత్ రెడ్డి తోనే సాధ్యమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు ఆకుల లత, నమిలికొండ లత, మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, గూడ విజయ రెడ్డి, గంట అంజయ్య గౌడ్ , బండారి బాల్ రెడ్డి , గుర్రపు రాములు, రఫీక్ , పందిర్ల శ్రీ నివాస్ గౌడ్, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, సిరిపురం మహేందర్, గంట వెంకటేష్ గౌడ్, అంతేర్పుల గోపాల్, కనకరాజు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
ఒకప్పుడు సైడ్ ఆర్టిస్ట్… ఇప్పుడు మాత్రం క్రేజీ హీరోయిన్. ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా?