మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీపై కేసు నమోదు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పురపాలక సంఘ పరిధిలో గల ఇంటి నెం 18319/12/B/14/A/1, అసెస్మెంట్ నెం.
18007576 & 1181007442 గల ఇంటికి రిజిస్ట్రేషన్ కొరకు సబ్ రిజిస్టర్ కార్యాలయములో కమీషనర్,పురపాలక సంఘం హుజూర్ నగర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి,తప్పుడు ధృవీకరణ పత్రములు సృష్టించి,సబ్ రిజిస్టర్, హుజూర్ నగర్ కార్యాలయములో సమర్పించి, రిజిస్ట్రేషన్ చేసుకొనుట కొరకు ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
కమిషనర్ ఇచ్చిన పిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు హుజూర్ నగర్ ఎస్ఐ తెలిపారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ వస్తుందా.. ఈ కాంబోలో సీక్వెల్ వస్తే హిట్ అంటూ?