టీడీపీ నేత నారా లోకేష్ పై కేసు నమోదు..!!

టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

విషయంలోకి వెళితే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి జరిగిందంటూ ఈ కేస్ నమోదు చేయడం జరిగింది.

ఈ కేసులో ఏ1గా నారా లోకేష్, ఏ2 గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్, ఏ5 గా శ్రీనివాస రావు లపై కేసు నమోదు చేయడం జరిగింది.

వీళ్లు మాత్రమే కాక మరి కొంతమంది నాయకుల పై కూడా కేసులు నమోదయ్యాయి.

వీరందరి పై హత్యాయత్నం తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న సీఐ నాయక్ పై.

లోకేష్ తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయని ఈ క్రమంలో హత్యాయత్నం కేసు.

నమోదు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ వైసీపీ కి తొత్తుగా మారిందని తెలుగుదేశం పార్టీ నాయకులు కీలక నేతలు మండిపడుతున్నారు.

అంత మాత్రమే కాక తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు వెనక పక్కా వ్యూహం ఉందని కావాలని అధికార పార్టీ.

ఈ దాడులు చేసినట్లు.చంద్రబాబు సహా మరికొంత మంది టీడీపీ కీలక నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Mahbubnagar District : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్