మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు..!!
TeluguStop.com
తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయిందని తెలుస్తోంది.గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఫిర్యాదు వచ్చింది.
ఈ మేరకు శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో మాజీమంత్రి మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసును పోలీసులు నమోదు చేశారని సమాచారం.
కాగా సుమారు 47 ఎకరాల భూమిని ఆయన కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పుష్ప 2 విషయం లో ఏదో తేడా కొడుతున్నట్టుగా ఉంది…