కొంప ముంచిన బ్లౌజ్.. దెబ్బకు విప్పేసిన బ్యూటీ
TeluguStop.com
హీరోయిన్లు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసేందుకు వెరైటీ రకాల దుస్తులు ధరిస్తుంటారు.ఇక హాట్ బ్యూటీల సంగతి మనందరకీ తెలిసిందే.
రెండు పీసుల బట్టలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేయాలని నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
బికినీలతో మొదలుకొని తమ ఎద అందాలు కనిపించేలా వేసుకునే బ్లౌజులతో పిచ్చెక్కిస్తుంటారు.అయితే ఇదే తరహాలో రెచ్చిపోదామని చూసిన ఓ బ్యూటీపై కేసు నమోదు కావడంతో ఇప్పుడు ఆమె తల పట్టుకుంది.
బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ తాజాగా ఓ ఫోటోషూట్‌లో వేసుకున్న బ్లౌజ్ ఆమెపై తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఆమె వేసుకున్న బ్లౌజ్‌పై హిందువుల దేవుడు శ్రీరామ అనే పేరును ముద్రించి ఉండటంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతుంది.
ఆమె ధరించిన బ్లౌజ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అంతేగాక ఈ వివాదం ఏకంగా కేసు వరకు దారి తీసింది.ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఎమ్ఎన్ జోషీ మార్గ్ పోలీసులకు వాణి కపూర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
""img "aligncenter" Src="" /
దీంతో ఆ ఫోటోషూట్ ఎందుకు చేశానా అంటూ అమ్మడు తలపట్టుకుంది.
అందాల ఆరబోత చేద్దామని చూసిన వాణి కపూర్ ఇప్పుడు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
మరి అంతలా ఎక్స్‌పోజింగ్ చేయడమెందుకు, లేనిపోని కేసులు తనపై వేసుకోవడం ఎందుకని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.
మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.