Rajadhani Files : రాజధాని ఫైల్స్ విడుదల ఆపాలంటూ పిటిషన్.. జగన్, కొడాలి పాత్రలను కించపరిచారంటూ?
TeluguStop.com
మరికొన్ని గంటల్లో రాజధాని ఫైల్స్ సినిమా( Rajadhani Files ) థియేటర్లలో విడుదల కానుంది.
ఈ మధ్య కాలంలో సంచలనాలు సృష్టించిన ట్రైలర్స్ లో రాజధాని ఫైల్స్ ట్రైలర్ కూడా ఒకటి.
అయితే ఈ సినిమా రిలీజ్ ఆపాలంటూ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.జగన్,( Jagan ) కొడాలి( Kodali ) పాత్రలను కించపరిచేలా ఈ సినిమా ఉందంటూ పిటిషన్ ను దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాల్సి ఉంది.
పిటిషన్ లో సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరడంతో పాటు సినిమా రిలీజ్ ఆపేయాలని పిటిషనర్ కోరారు.
వైసీపీ ఎమ్మెల్సీ లెళ్ల అప్పిరెడ్డి( YCP MLC Lella Appi Reddy ) ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.
అయితే సినిమా నిర్మాతల తరపు లాయర్లు మాత్రం ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ పూర్తైందని ఎవరినీ కించపరచాలనే ఆలోచనతో సినిమా తీయలేదని సెన్సార్ సభ్యుల సూచనల మేరకు 13 సీన్లను తొలగించామని చెప్పుకొచ్చారు.
"""/" /
ఈరోజు పిటిషన్ విషయంలో తుది తీర్పు రానుంది.ఇప్పటికే రాజధాని ఫైల్స్ సినిమాకు బుకింగ్స్ మొదలైన నేపథ్యంలో ఈ మూవీ వాయిదా పడటం సులువైన విషయం కాదు.
కొన్ని ఏరియాలలో ఈరోజు రాత్రి నుంచి ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి.
ఏపీలో త్వరలో ఎన్నికలు( AP Elections ) జరగనున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో పొలిటికల్ సినిమాల హవా పెరిగింది.
"""/" /
రాజధాని ఫైల్స్ సినిమా 2 గంటల 40 నిమిషాల నిడివితో తెరకెక్కగా ఈ సినిమాకు మణిశర్మ, మరి కొందరు టాప్ టెక్నీషియన్లు పని చేశారు.
రాజధాని ఫైల్స్ సినిమా విడుదల తర్వాత సంచలనాలు సృష్టిస్తుందో లేదో చూడాలి.రాజధాని ఫైల్స్ సినిమా బుకింగ్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
జామ పండుతో ఇలా చేశారంటే మీ చర్మం మెరిసిపోద్ది!