పవన్ పై ఆ సెక్షన్ పై కేసు నమోదు.. కేసు ప్రూవ్ అయితే అన్నేళ్ల జైలు శిక్ష పడుతుందా?
TeluguStop.com
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వాలంటీర్ల గురించి, గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగుల గురించి చేసిన కామెంట్ల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు వాలంటీర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.వాలంటీర్ల విషయంలో పవన్ చేసిన కామెంట్లు పొలిటికల్ గా కూడా పవన్ కు ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ల విషయంలో వైసీపీ కేసు పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.
వాలంటీర్లపై( Volunteers ) ఆరోపణలు చేసిన పవన్ ఆ ఆరోపణలను ప్రూవ్ చేస్తే ఎలాంటి సమస్య లేదు కానీ ప్రూవ్ చేయలేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు.
పవన్ పై సీఆర్ పీసీ 199(4) సెక్షన్ కింద కేసు నమోదు దిశగా అడుగులు పడుతున్నాయి.
పవన్ సైతం తాను ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదని చెబుతున్నారు. """/" /
ఈ కేసు కింద తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉండగా జరిమానాకు కూడా ఛాన్స్ ఉందని అయితే బెయిల్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదని సమాచారం.
పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ మరో ఆరు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా విషయంలో ఏపీ సర్కార్( AP Govt ) ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది.
"""/" /
క్రేజ్ ఉన్న నటీనటులు ఈ సినిమాలో నటిస్తుండగా బ్రో సినిమా పవన్ కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బ్రో మూవీ( Bro Movie )తో మరో బ్లాక్ బస్టర్ సాధిస్తానని సాయితేజ్ సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
రేపు ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.పవన్ ఈ ఏడాది ఓజీ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది.
తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ వస్తుందా? రూల్స్ ఎం చెబుతున్నాయంటే!