ఎంపీ రఘురామపై హైదరాబాద్ లో కేసు నమోదు..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై హైదరాబాద్ గచ్చిబౌలిలో కేసు నమోదు చేయడం జరిగింది.

ఏపీ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ సుభాని ఫిర్యాదు మేరకు.ఎంపీ రఘురామ రాజు కొడుకు భరత్ ఆయన పిఏ శాస్త్రీయలతో పాటు సిఆర్పిఎఫ్ కి చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుల్ లను నిందితులుగా చేర్చారు.

హైదరాబాదు నగరం పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది.

ప్రధాని భద్రతలో ఉన్న తనపై దాడి చేసి మూడు గంటలు నిర్బంధించారని.సుభాని ఫిర్యాదులో తెలిపారు.

ఇదే సమయంలో ISB వద్ద ఉన్న తనను బలవంతంగా లాక్కెల్లారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఏటువంటి అనుమతులు లేకుండా తన ఇంటి వద్దనే పెట్టడం ఏంటి అంటూ రఘురామ రాజు మండిపడుతున్నారు.

అయితే పోలీస్ విధులలో ఉన్నట్లు తమ అనుచరులు పట్టుకున్న టైంలో సదరు వ్యక్తి చెప్పలేదని.

ఎంపీ రఘురామ చెప్పుకొస్తున్నారు.మరి ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో చూడలి.