తప్పుడు పత్రాలు సృష్టించిన ముగ్గురిపై కేసు, రిమాండ్ కి తరలింపు

సూర్యాపేట జిల్లా: తప్పుడు పత్రాలు సృష్టించి 10 మంది లబ్దిదారుల కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకున్న సంఘటన నూతనకల్లు మండలం మాచనపల్లి గ్రామంలో జరిగింది.

ఇదే విషయంపై లబ్ధిదారులకు, మధ్యవర్తికి డబ్బులు పంచుకునే విషయంలో గొడవల జరగడంతో విషయం బయటకు వచ్చింది.

ఇటీవల ఇట్టి విషయంపై ఫిర్యాదు రావడంతో నూతనకల్ తహసీల్దార్ ఫీల్డ్ ఎంక్వయిరీ చేసి పోలీస్ స్టేషన్ యందు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేసిన ఎస్ఐ మాచనపల్లి పంచాయితీ కార్యదర్శి వెంకటరెడ్డి, మిర్యాల పంచాయితీ కార్యదర్శి ఏషమోళ్ల అనిల్ మరియు మచనపల్లి గ్రామానికి చెందిన గ్రామ పంచాయితీ వర్కర్ మట్టిపల్లి గణేష్ అనే ముగ్గురు నిందుతులను రిమాండ్ చేసి కోర్ట్ ముందు హాజరు పరచగా,కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ మహేంద్రనాధ్ తెలిపారు.

పై ముగ్గురు నేరస్తులు,10 మంది లబ్దిదారుల వివాహాలు గత 10 సం క్రితమే అయ్యాయని,అందులో కొంత మంది వివాహాలు తెలంగాణ ఏర్పడక ముందే అయ్యాయని,వాటిని 2023,2024 లో అయినట్టు పత్రాలు సృష్టించి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ది పొంది, ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు ఎస్ఐ  తెలిపారు.

స్టార్ హీరో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్.. అసలేం జరిగిందంటే?