మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పై కేసు.. ఎందుకంటే.. ?
TeluguStop.com
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌పై కేసు నమోదైంది.
ఇది వరకే ఎన్నో ఆరోపణలు ఎఎదుర్కొంటున్న మనోహర్ పై గతంలో కూడా పోలీసు కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఇకపోతే ఏపీలో తాజాగా జరుగుతున్న పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో కుప్పం మండలం వి.
మిట్టపల్లి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించు కోవాలంటూ మనోహర్ బెదిరించాడట.ఈ విషయం పోలీసు మెట్లు ఎక్కడంతో మనోహర్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొంటున్నారు.
అయితే ఈ విషయంలో మనోహర్ మాత్రం తనకు ఈ బెదిరింపులకు ఎలాంటి సంబంధం లేదని, టీడీపీ అంటేనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ ఒత్తిడితోనే తనపై కేసు నమోదు చేశారని, కేవలం రాజకీయ కక్షతో ఇలా చేస్తున్నట్లుగా మనోహర్ ఆరోపించారు.
ఇకపోతే మనోహర్‌తో పాటు వి.మిట్టపల్లి టీడీపీ అభ్యర్థి, మంజునాథ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారట.
మట్కా సినిమా సక్సెస్ సాధించిందా..? వరుణ్ తేజ్ పరిస్థితి ఏంటి..?