కడుపుతో ఉన్నా ఆ సీన్ కోసం పదకొండు సార్లు జారిపడ్డా..ఆనాటి సినిమా కష్టాలను వివరించిన వరలక్ష్మి..
TeluguStop.com
తెలుగు చిత్రపరిశ్రమలో చెల్లెలి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆమె.పరిచయం అక్కర్లేని మనిషి వరలక్ష్మి.
క్రిష్ణ,నాగేశ్వర్రావు,శోభన్ బాబు,వెంకటేష్,చిరంజీవి ఇలా స్టార్ హీరోలందరికి చెల్లెలిగా నటించిన వరలక్ష్మి పోషించినన్ని చెల్లెలి పాత్రలు ప్రపంచంలో ఏ నటీ పోషించి ఉండదు అంటే అతిశయోక్తి కాదు.
చెల్లెలు పాత్రే కదా .చాలా చిన్న పాత్ర,సింపుల్ అనుకుంటే చాలా పొరపాటు.
ఏ పాత్ర కష్టాలు వారికుంటాయి.ఇటీవల ఒక టివి ఛానెల్లో ప్రోగ్రాం కి అటెండ్ అయిన ఆమె.
సినిమాల్లో తన కష్టాల గురించి.ముఖ్యంగా రేప్ సీన్ల గురించి వరలక్ష్మి తొలిసారి పెదవి విప్పారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అవేవిటో ఆమె మాటల్లోనే.‘రేప్ సీన్ల కోసం హైదరాబాద్‌లో, చెన్నైలో నేను తిరగని వీధిలేదు.
చెల్లెలు ఎంత కష్టపడితే అంతగా సీన్ పండుతుందని అలా తీసేవారు.మాది డబ్బున్న కుటుంబం కాదు.
నేను నా తోబుట్టువులు కూడా బాలనటులే.అందరితో కలసి పనిచేశాను.
కానీ కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయి.ఒక ఫైట్ మాస్టర్ నన్ను టార్గెట్ చేశారు.
నేను మొదట్లో గుర్తించలేదు.తర్వాత అర్థమైంది.
కృష్ణ నటించిన ‘అశ్వత్థామ‘ చిత్రంలో నేను చెల్లెలుగా నటించాను.నన్ను వేధించే సీన్ అది.
ఒక సీన్లో నేను తడిబట్టలతో 25 మెట్లు ఎక్కాలన్నారు.అలాగే ఎక్కాను.
ఒకతను నా కాళ్లను పట్టుకుని రెండు మెట్లు కిందికి లాగాలి, తర్వాత నేను అతణ్ని తన్నేసి పారిపోవాలని ఫైట్ మాస్టర్ చెప్పాడు.
కానీ ఫుల్ సాట్ పెట్టేశారు.నా కాళ్లు పట్టుకున్న మనిషి రెండుమెట్లు కాకుండా నన్ను ఒక బొమ్మలాగా 24 మెట్లు కిందికి లాగాడు.
మెట్ల కింద వున్న సిమెంట్ దిమ్మ నడుముకు తగలింది.పెద్దగా ఏడ్చేశా.
తర్వాత ఫైట్ మాస్టర్ నాకు సారీ చెప్పాడు.అతని ఫైట్లున్న సినిమాల్లో తర్వాత నటించలేదు.
నా వెనకాల బ్యాగ్రౌండ్ లేదనే నన్ను అలా వేధించారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
‘ మొహన్ బాబు ,దివ్యభారతి జంటగా నటించిన చిట్టెమ్మ మొగుడు సినిమాలోని సీన్.
మోహన్ బాబుకు చెల్లెలిని.ఆ సీన్లో నేను పొరపాటున నేలపై జారిపడాలి.
ఆ సీన్ చాలాసార్లు తీశారు.సరిగ్గా జారిపడలేదని చెప్పారు.
11 సార్లు జారపడ్డాను.ఇక నావల్ల కాలేదు.
కూర్చుని ఏడ్చేశాను.దర్శకుడు కోదండరామిరెడ్డి వచ్చి ఏమైందమ్మా అని అడిగారు.
చెప్పాను.నేను మూడు నెలల గర్భిణిని అని.
అది విన్న ఆయన బాధపడిపోయారు.బాగున్న షాట్లలో ఒకదాన్ని ఓకే చేయమన్నారు.
నేను సినిమా కోసం బిడ్డను పోగొట్టుకోలేను కదా.నాకేమో అలాంటి పాత్రలే ఇస్తారు.
అందుకే సినిమాలను కొంతకాలం మానేశాను.’అంటూ ఆనాటి కష్టాలను చెప్పుకొచ్చారు.
10 రూపాయల టికెట్ కొని పుష్ప ది రూల్ చూశా.. నటి సంయుక్త షాకింగ్ కామెంట్స్ వైరల్!