యువతిని నేలపై పడుకోబెట్టి చైనా అధికారులు ఘోరం.. వీడియో వైరల్!

కరోనా వ్యాప్తిని సమూలంగా అరికట్టేందుకు చైనా తన కఠినమైన జీరో-కోవిడ్ విధానాన్ని అమలు చేస్తోంది.

ఈ లాక్‌డౌన్‌లో షాంఘై వంటి ఇతర నగరాల్లో ఎవరినీ బయటకి రానివ్వడం లేదు.

కోవిడ్-19 వ్యాప్తిని తగ్గించేందుకు రాజధాని బీజింగ్ లో హై అలర్ట్‌ ప్రకటించారు.ఇక్కడ రెస్టారెంట్లు, బార్‌లు, జిమ్‌లు మూసేశారు.

అలాగే బయట తిరిగే వారిపై అధికారులు చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నారు.తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చైనా అధికారుల దాష్టీకం ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతోంది.

కోవిడ్ పరీక్ష కోసం ఒక చైనీస్ యువతిని ఒక ఆరోగ్య అధికారి నేలపై పడుకోబెట్టి.

ఆమె బాడీ పై కూర్చొని చాలా అమానుషంగా వ్యవహరించాడు.వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతిని నేలపై పడుకోబెట్టి కోవిడ్ టెస్ట్ బలవంతంగా చేస్తున్నట్లు చూడొచ్చు.

ఈ క్రమంలో ఆమె అరుస్తూ బలవంతపు టెస్ట్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది.కానీ ఆ వ్యక్తి ఆమె చేతులను మోకాళ్ల క్రింద నొక్కి గట్టిగా పట్టుకున్నాడు.

పీపీఈ సూట్‌లో ఉన్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్త ఆమె నుంచి శాంపిల్స్ తీసుకునేందుకు ఆమె నోరును బలవంతంగా తెరిచాడు.

ఈ విధంగా అతను ఒక యువతి అని కూడా చూడకుండా కరోనా శాంపిల్స్ తీసుకున్నాడు.

"""/"/ వీడియో చూసిన నెటిజన్లు చైనా ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ప్రజల పై దారుణమైన దాడులు చేయడం అధికార దుర్వినియోగం అని ఇంకొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.

చైనా అధికారులు ఇంకా ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు.ప్రజల ఇళ్లను ఇనుప కడ్డీలతో బంధీ చేయడం వంటి నిబంధనలు కూడా యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.

ఏది ఏమైనా కరోనా కట్టడి పేరిట చైనా ప్రజలను అధికారులు బాగా హింసిస్తున్నారు.

ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.