కరోనా వైరస్ ని కంట్రోల్ చేయడానికి భారత్ కీలక నిర్ణయం

చైనాలో కరోనా వైరస్ రోజురోజుకి విస్తరిస్తుంది.ఇక ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది.

ఇందులో మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది.దీనిని కంట్రోల్ చేయడానికి చైనా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది.

జంతువుల నుంచి సంక్రమించిన ఈ వ్యాధి ప్రభావం అక్కడ విపరీతంగా ఉంది.ఇదిలా ఉంటే ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనా వైరస్ తమ దేశంలోకి రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఇక చైనాకి అనుకోని ఉన్న భారత్ కూడా ఈ కరోనా వైరస్ పట్ల ఇప్పటికే అప్రమత్తంగా ఉంది.

రెండు ప్రత్యేక విమానాల ద్వారా చైనాలోని వుహాన్‌ నగరం నుంచి 600 మందికి పైగా భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి రప్పించింది.

ఇదిలా ఉంటే ఈ కరోనా వైరస్ ఇండియాలోకి రాకుండా నియంత్రించడానికి భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

చైనీయులకు, చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఆన్‌లైన్‌ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు భారత్ ప్రకటించింది.

తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని బీజింగ్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ-వీసా మీద భారత పర్యటనకు వెళ్లాలనుకే సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు.

తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ వెళ్లాలనుకునేవారు బీజింగ్‌లోని భారత ఎంబసీ కార్యాలయాన్ని, షాంఘై, గ్వాంగ్జౌ నగరాల్లోని భారత కాన్సులేట్‌లను సంప్రదించవచ్చునని సూచించింది.

ఈ వారం ఓటిటి లవర్స్ కు పండుగే.. దేవరతో పాటు పలు సినిమాలు స్ట్రీమింగ్