కూతురి పెళ్లిరోజు ఈ తండ్రి ఎంత సాహసం చేశాడో తెలిస్తే..

తండ్రీ కూతుర్ల కంటే తల్లీకూతుర్ల మధ్య అనుబంధం బలంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు కానీ కూతుళ్ల సంరక్షణలో తండ్రులు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.

తండ్రులు చూపించే ప్రేమ, మద్దతు కూతుళ్లను ఎంతగా ఆనందపడతాయో అందరికీ తెలుసు.తాజాగా, ఒక తండ్రి తన కూతురి పెళ్ళికి( Daughter's Wedding ) వెళ్లడానికి చేసిన ప్రయాణం ప్రపంచాన్ని కదిలించింది.

ఈ తండ్రి, కఠిన వాతావరణాన్ని లెక్క చేయకుండా, దాదాపు 50 కిలోమీటర్లు నడిచి తన కూతురి పెళ్ళికి చేరుకున్నాడు.

వివరాల్లోకి వెళితే డేవిడ్ జోన్స్( David Jones ) అనే ఆ తండ్రి, దక్షిణ కరోలినా నుంచి టెన్నెస్సీ వరకు 12 గంటలు నడిచాడు.

హెలెన్ తుఫాను( Helene Hurricane ) కారణంగా బయట పరిస్థితులు ఏమాత్రం బాగో లేకపోయినా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

ఈ కథను గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ పంచుకోవడంతో ఆయన ప్రతి ఒక్కరి హృదయాల్లో హీరో అయిపోయాడు.

"""/" / డేవిడ్ జోన్స్ తన బ్యాగ్‌ను మోసుకుని, తన కూతురు ఎలిజబెత్( Elizabeth ) పెళ్ళిని మిస్ కాకూడదనే కోరికతో బయలుదేరాడు.

కానీ తుఫాను కారణంగా అతను రెండు గంటల్లో చేరే గమ్యాన్ని కారులో చేరుకోవడం అసాధ్యమైంది.

ఒక పోలీస్ అధికారి అతనికి తన గమ్యాన్ని చేరుకోవడంలో సహాయం చేశాడు.12 గంటల ప్రయాణం తర్వాత, డేవిడ్ స్నానం చేసి, తన టక్సీడో వేసుకుని, తన కూతుర్ని మండపానికి తీసుకెళ్లాడు.

ఏదీ అతన్ని ఆపలేదని అతను చెప్పాడు. """/" / చెడు వాతావరణం ఉన్నప్పటికీ, మారథాన్ రన్నర్ డేవిడ్ జోన్స్ వెనక్కి తగ్గలేదు.

అతను తన బ్యాగ్‌లో కొన్ని వస్తువులు ప్యాక్ చేసుకుని, మోకాళ్ల లోతు నీటిలో కూడా నడుస్తూ 30 మైళ్లు నడిచాడు.

12 గంటల తర్వాత, అతను చివరకు తన గమ్యాన్ని చేరుకున్నాడు.తన కూతురి పెళ్ళికి హాజరు కావడానికి డేవిడ్ చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో చాలా మందిని కదిలించింది.

అక్టోబర్ 2న పంచుకున్న ఆ పోస్ట్‌కు లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి.కామెంట్‌లలో, ప్రజలు తమ ఆనందం, మద్దతును వ్యక్తం చేశారు.

తండ్రి ప్రేమను చూసి భర్త ఫిదా అయిపోయి ఉంటాడు తన తండ్రి లాగా అతను తన భార్యను చూసుకోగలడా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

తండ్రి పాత్రను డేవిడ్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టు ఉన్నాడు అని మరి కొంతమంది పేర్కొంటున్నారు.

రాజమౌళి ఫస్ట్ లవ్ స్టోరీ మీకు తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!