అవినీతి, కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్..: మోదీ

వరంగల్ బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ( Prime Minister Modi ) పాల్గొన్నారు.

బీజేపీ అభ్యర్థికి మద్ధతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్ అని ప్రధాని మోదీ తెలిపారు.బీజేపీ విజయం వైపు దూసుకెళ్తోందన్న ఆయన వరంగల్ తో బీజేపీకి ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు.

కాంగ్రెస్( Congress ) ఎక్కడ గెలుస్తుందా అని విజయం కోసం భూతద్దం పెట్టుకుని చూస్తోందని ఎద్దేవా చేశారు.

అయితే వరంగల్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరబోతోందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టబోతున్నారన్న మోదీ అవినీతి, కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్ అని ఆరోపించారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్య ఉంటుందని విమర్శించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి20, సోమవారం2025