వరదలలో కారు కొట్టుకుపోకుండా కారుకి తాడు కట్టిన ఫోటో వైరల్!
TeluguStop.com
హైదరాబాద్ లో తాజాగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవ్వడంతో నగరంలోని పలు ప్రదేశాలు నీటి మయమయ్యాయి.
మరికొన్ని ప్రదేశాలలో నీటి ఉధృతి ఎక్కువ అవ్వడంతో ఇంటి బయట పార్క్ చేసిన కార్లు,బైకులు వరదలో కొట్టుకుపోయాయి.
ఇది మర్చిపోకముందే వాతావరణ శాఖ మరోమారు హైదరాబాదులో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని చెప్పడంతో ఒక వ్యక్తి తన కార్ ను ఇంటి గేట్ కు వేసి తాడులతో కట్టాడు.
దానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ ఫోటోను చూసిన సోషల్ మీడియా యూజర్స్ కొందరు పాపం వరద నీటిలో తన కార్ కొట్టుకొని పోకూడదని అతడు చేసిన ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాం అంటుంటే మరికొందరు వాట్ ఎన్ ఐడియా సర్జీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ బ్రహ్మాజీ ట్విట్టర్ వేదికగా నేను పడవ కొనాలి అనుకుంటున్నాను మరి అందుకోసం మీరేమైనా సూచిస్తారా? అంటూ ట్వీట్ చేశారు.
సరిగ్గా ఇలాంటి టైంలో ఆయన ట్వీట్ తో పాటు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ప్రత్యేకంగా నిలుస్తుంది.
శ్రీకాంత్ ఓదెల చిరంజీవి కాంబోలో భారీ సినిమా రాబోతోందా..?