కాంగ్రెస్ రెబల్స్  కి కాల్ చేస్తున్న ‘ కారు ‘ పార్టీ ! పార్టీలోకి రమ్మని మాత్రం కాదు 

కాంగ్రెస్ రెబల్స్  కి కాల్ చేస్తున్న ‘ కారు ‘ పార్టీ ! పార్టీలోకి రమ్మని మాత్రం కాదు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్( Congress ) దూసుకుపోతున్నా,  ప్రధాన పోటీ అంతా కాంగ్రెస్ నుంచి తమకు ఎదురుకాబోతూ ఉండడం తో బీ ఆర్ ఎస్ అలెర్ట్ అవుతోంది.

కాంగ్రెస్ రెబల్స్  కి కాల్ చేస్తున్న ‘ కారు ‘ పార్టీ ! పార్టీలోకి రమ్మని మాత్రం కాదు 

  ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా మూడోసారి బీ ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చే విధంగా అనేక వ్యూహాలు రచిస్తున్నారు.

కాంగ్రెస్ రెబల్స్  కి కాల్ చేస్తున్న ‘ కారు ‘ పార్టీ ! పార్టీలోకి రమ్మని మాత్రం కాదు 

కొంతమంది కాంగ్రెస్ నేతల్ని  చేర్చుకున్నారు .అయితే చేరికలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో,  బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) మరో వ్యూహాన్ని రచించారు.

ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా పై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

కీలక నాయకులకు కొంతమందికి పార్టీ టికెట్ దక్కక పోవడం తో  చాలామంది చాలా నియోజకవర్గంలో రెబల్ గా పోటీకి దిగుతున్నారు.

"""/" / వారికి బీఆర్ఎస్ లోని కొంతమంది కీలక నేతలు ఫోన్ కాల్ చేస్తున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ రెబల్స్ గా కొనసాగాలని , నామినేషన్ ఉపసంహరించుకోవద్దని,  పోటీలో ఉంటే మీకు కావాల్సిన నిధులు సమకూరుస్తామని హామీ ఇస్తున్నారట.

దీనికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత ఎక్కువ చీలితే అంతగా తమ అభ్యర్థుల గెలుపు సాధ్యమని బీఆర్ఎస్( BRS ) అంచనా వేస్తోంది.

  అందుకే ఎక్కువమంది స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ రెబల్స్ గా బరిలో ఉండాలని ఆ పార్టీ భావిస్తోంది.

  అందుకే కొంతమందికి ఆర్థికంగానూ అండదండలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారట.ముఖ్యంగా కాంగ్రెస్ రెబల్స్ గా పోటీకి దిగుతున్న అభ్యర్థుల్లో ఆ పార్టీ ఓట్లు ఎక్కువగా చీల్చే నేతలను గుర్తించి , వారికి నేరుగా ప్రగతి భవన్ వర్గాలే ఫోన్ చేసి పోటీలో కొనసాగాలని,  మీకు కావాల్సిన నిధులు సహాయ సహకారాలు అందిస్తామని బీఆర్ఎస్ పెద్దలు ప్రోత్సహిస్తున్నారట.

"""/" / ఈ మేరకు స్థానికంగా ఉండే బీఆర్ఎస్ ఇన్చార్జీలు రెబల్స్ వద్దకు వెళ్లి సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం .

పోటీలో ఉండేందుకు అంగీకారం తెలిపిన వారికి వెంటనే కొంత నగదును కూడా అందిస్తున్నారట.

ప్రధాన అభ్యర్థుల ప్రచారానికి దీటుగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని వారికి సూచిస్తున్నారట.

  ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం,  మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ రెబల్స్ పై బిఆర్ఎస్ ఎక్కువగా దృష్టి పెట్టిందట.

ఈ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో, ఇక్కడ ఎక్కువ మంది రెవెల్స్ పోటీలో ఉండడంతో వారి ద్వారా కాంగ్రెస్ ఓట్లలో చీలిక తెచ్చి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు బాటలు వేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారట.

ఆ హీరోయిన్ వల్లే నా డ్యాన్స్ ఇంప్రూవ్ అయింది.. చైతన్య షాకింగ్ కామెంట్స్ వైరల్!