గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవ్వుతు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు ! ఎక్కడంటే ?

ఇప్పుడు ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశం కు వెళ్లాలంటే చాలా ఈజీగా వెళ్ళవచ్చు.

అందుకు మనకు గూగుల్ మ్యాప్స్ ఉపయోగపడుతాయి.ఇవి లేని సమయంలో కొత్త ప్లేస్ లోకి వెళ్లాలంటే ఎవరో ఒక్కరిని ప్రతిసారి సాయం అడుగుతూ వెళ్ళేవాళ్లం.

కానీ నేడు ప్రపంచం అడ్వాన్స్ అయింది.టెక్నాలజి అందుబాటులోకి వచ్చింది.

కానీ అన్నీ సార్లు దాన్ని నమ్ముకుంటే మనం మునిగిపోవడం ఖాయం.ఈ విషయం మరోసారి నిరూపితమైంది.

పుణె కు చెందిన గురు శేఖర్ ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

అతడు తన స్నేహితుడు సమీర్ మరియు ఇంకో ఫ్రెండ్ తో కలిసి మహారాష్ట్రంలోని అత్యంత ఎత్తైన ప్రదేశం కల్సుభాయ్ మీదకు కారు వేసుకొని వెళ్లారు.

అల వెల్లుతున్న వారు దారి మధ్యలో రూటు మర్చిపోయారు.అప్పుడు వారి వద్ద ఉన్న మొబైల్ పోన్ లోని గూగుల్ మ్యాప్స్ ను ఆన్ చేసుకొని అది చెప్పే రూట్ లో వాళ్ళు బయలుదేరి వెళ్లారు.

"""/"/ అప్పటికి చీకటి పడిపోవడంతో గూగుల్ మ్యాప్స్ పైనే భారం వేసి బయలుదేరి వెళ్లారు అల సగం దూరం వెళ్ళిన వాళ్ళకు ఓ పెద్ద బ్రిడ్జ్ కనిపించింది దాని మీదుగా ప్రయాణం సాగించిన వారు కొంత దూరం వెళ్ళాక వారు నదిలో పడిపోయారు.

చీకటిలో బ్రిడ్జ్ ఉంటుందని అనుకున్న వారు గూగుల్ మ్యాప్స్ ప్రకారం అలానే ప్రయాణం చేశారు.

కారు నదిలో పడిపోవడంతో అప్రమత్తం అయిన సమీర్, గురు శేఖర్ కారు తలుపులు తీసుకొని బయటకు వచ్చారు.

కానీ వారితో పాటుగా వచ్చిన మరో వ్యక్తి కారులో చీకుక్కొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

ఈ విషయం పోలీసులకు తెలవడంతో సంఘటన స్థలం కు చేరుకొని కారులో చికుక్కున వ్యక్తిని బయటకు తీశారు.

పోలీసుల సమాచారం మేరకు అక్కడ బ్రిడ్జ్ ఉన్న మాట వాస్తవమే కానీ అది సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రమే తీసి ఉంటుంది.

మిగతా 8 నెలలు ఆ బ్రిడ్జిని మూసివేస్తారని అన్నారు.అన్నీ సమయంలో గూగుల్ మ్యాప్స్ ను నమ్మలేమని నెటిజన్స్ అంటున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??