కారు, బైక్ ఢీ.. షాకింగ్ యాక్సిడెంట్ కెమెరాలో రికార్డ్!

భారతీయ రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ పాటించేవారు చాలా తక్కువ.అందుకే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి.

కాగా తాజాగా ఒక వ్యక్తి బైక్‌పై తన భార్యాపిల్లలతో వెళ్తూ కారుకు డ్యాష్ ఇచ్చాడు.

ఈ యాక్సిడెంట్‌కి సంబంధించి ఓ క్లిప్ ఆన్‌లైన్‌లో విస్తృతంగా వైరల్ అవుతుంది.ఈ ప్రమాదం పూణెలోని జున్నార్ ప్రాంతంలోని టి-పాయింట్ వద్ద జరిగింది.

దీనికి సంబంధించిన దృశ్యాలు సర్వేలెన్సు కెమెరాలు రికార్డు అయ్యాయి.పుణెలోని జున్నార్ ప్రాంతంలో ఒక మోటర్‌సైకిల్ ఒక టి-పాయింట్‌ను దాటుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని స్థానిక న్యూస్ మీడియా నివేదికలు తెలిపాయి.

వైరల్ వీడియోలో ద్విచక్ర వాహనదారుడు బెల్హే-జెజురి హైవేపై మలుపు తీసుకుంటున్నాడు.అయితే అటువైపు నుంచి కారు వస్తుందని చూసినా అతడు అంతే చాలా వేగంగా రోడ్డు దాటుతూ కనిపించాడు.

ఇలా సడన్‌గా బైక్‌ ముందు ఎదురు కావడంతో వ్యాగన్ఆర్ కారు డ్రైవర్ బ్రేక్ వేయడంలో ఆలస్యమైంది.

దాంతో ఆ కారు బైక్ ను ఢీకొట్టింది.అప్పటికే కారు డ్రైవర్ చాలా చిన్నగా వెళ్తూ కారు బ్రేక్ వేసింది.

దీనివల్ల బైక్‌పై వెళ్తున్న కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. """/"/ ఈ ఘటన చూసిన స్థానికులు హుటాహుటిన వారిని కాపాడేందుకు తరలివచ్చారు.

అదృష్టవశాత్తూ, రైడర్, అతని భార్య.వారి బిడ్డకు ఎటువంటి తీవ్రమైన గాయాలు కాలేదు.

ఈ క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వెంటనే, నెటిజన్లు ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలను విశ్లేషించారు.

ఈ ప్రమాదం వ్యాగన్‌ఆర్‌ డ్రైవర్‌ తప్పిదమేనని పలువురు అంగీకరించారు.క్రాసింగ్‌లకు రోడ్డు డిజైన్ తప్పుగా ఉందని కూడా కొందరు చెప్పారు.

మరికొందరు హెల్మెట్ ధరించనందుకు బైక్ రైడర్‌కు జరిమానా విధించాలని అన్నారు.

మీరు అన్ మ్యాచబుల్… రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించిన సమంత?