హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కారు బీభత్సం
TeluguStop.com
హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో కారు బీభత్సం సృష్టించింది.ఎయిర్ పోర్టు ప్రధాన దారిలో ఆగి ఉన్న కారును వెనుక నుంచి మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
దీంతో రెండు కార్లు పల్టీ కొట్టి కాల్వలోకి దూసుకెళ్లాయని తెలుస్తోంది.ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జు నుజ్జు కాగా ముగ్గురు గాయపడ్డారని సమాచారం.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఆ వర్క్ కూడా చేశారా.. ఏమైందంటే?