హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు.. ఇదేం న్యాయం అంటూ ఆ ప్లేయర్లు షాక్..!

ఈ ఏడాది వేసవిలో జరిగే 2022 సీజన్ కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు క్రికెట్ అభిమానులు.

కొత్తగా రెండు టీమ్స్ జాయిన్ కావడంతో పాటు పాత జట్లలోని మార్పులవల్ల ఈసారి ఐపీఎల్ మరింత రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

కొద్ది నెలల్లో ముంబైలోనే పూర్తి సీజన్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ రచిస్తున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

ఈనేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది.అదేంటంటే ఈసారి టీమిండియా ఆల్‌రౌండర్‌ అయిన హార్దిక్ పాండ్య ఓ ఐపీఎల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడట.

లక్నోతోపాటు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఐపీఎల్ 2022లో అడుగు పెట్టనున్న విషయం విదితమే.అయితే అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

2021 సీజన్ వరకు ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్య ఆడాడు.అయితే ఆద్యంతం అతడి పేలవమైన ఆట ప్రదర్శనతో చిర్రెత్తిన ముంబై ఇండియన్స్ అతన్ని వదిలేసింది.

దాంతో అహ్మదాబాద్ టీం అతన్ని కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు కూడా ధారపోసిందని తెలుస్తోంది.

లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం మంచి ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేయగా.

అతన్ని కూడా అహ్మదాబాద్ యాజమాన్యం జాయిన్ చేసుకుంది.ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ విడిచిపెట్టిన డేవిడ్ వార్నర్ కూడా ఈ కొత్త జట్టులో స్థానం సంపాదించినట్లు తెలుస్తోంది.

అఫ్ఘానిస్తాన్ ఆల్‌రౌండర్‌ రషీద్ ఖాన్, భారత జట్టు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ లను కూడా వేలం సొంతం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

"""/"/ అయితే ఇలాంటి మేటి ప్లేయర్ల మధ్య అసలు ఫామ్ లో లేని పాండ్యకు కెప్టెన్సీ ఇస్తే విస్తుపోవాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆ జట్టులో చేరే మేటి ప్లేయర్లందరికీ పాండ్య కెప్టెన్సీ విషయం కచ్చితంగా షాక్ ఇస్తుందని అంటున్నారు.

అహ్మదాబాద్ మాత్రం హార్దిక్ పాండ్యలో నాయకత్వ లక్షణాలు మెరుగ్గా ఉన్నాయని భావిస్తోంది.ఇదిలా ఉండగా తాజాగా బీసీసీఐ అహ్మదాబాద్ ఫ్రాంచైజీ చుట్టూ చుట్టుముట్టిన సమస్యలను పరిష్కరించి.

దాన్ని ఐపీఎల్ లో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీనితో ఇక మెగా వేలం జరగడమే తరువాయి అయ్యింది.

కళ్ళ చుట్టూ నల్లటి వలయాలా.. క్యారెట్ తో చెక్ పెట్టండిలా!