వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై కెప్టెన్ రోహిత్ సంచలన వ్యాఖ్యలు..!!

వన్డే వరల్డ్ కప్ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది.ఆదివారం అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ వర్సస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఈ టోర్నీలో రెండు జట్లు అద్భుతంగా రాణించాయి.ఆల్రెడీ ఆస్ట్రేలియా జట్టును ఈ టోర్నీలో లీగ్ దశలో భారత్ ఓ మ్యాచ్ లో ఓడించడం జరిగింది.

అయితే ఫైనల్ లో ఈ రెండు టీమ్స్ తలపడుతుండటంతో ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది.

మరి కొద్ది గంటలలో మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం.వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

"""/" /   ఈరోజు కోసం గత రెండు సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

తాను వన్డే ఫార్మేట్ మ్యాచ్ లు చూస్తూ పెరగడం జరిగింది అని తెలిపారు.

కాగా అన్ని ఫార్మేట్ లకు కెప్టెన్ అయినప్పుడే ఈ వరల్డ్ కప్ కోసం టీం అంతా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లు తెలియజేశారు.

ప్రస్తుతం తమ బాధ్యతలో అందరూ చాలా స్పష్టతతో ఉన్నారు.ముఖ్యంగా కోచ్ ద్రావిడ్ కోసం.

మేం దీన్ని సాధ్యం చేయాలనుకుంటున్నాం.ఈ క్రమంలో రేపటి ఫైనల్ మ్యాచ్ లో పొరపాట్లు చేస్తే.

గత పది మ్యాచ్ లలో గెలవటం కూడా వృధా అవుతుందని రోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తామశక్తి మేర ఫైనల్ లో రాణిస్తామని స్పష్టం చేశారు.

విశ్వంభర సినిమాలో ఒక్క ఫైట్ కోసం అన్ని కోట్లు పెడుతున్నారా..?