క్యాప్సికమ్‌తో ఇలా చేస్తే హెయిర్ ఫాల్‌కి స్వస్థి పలకొచ్చు..తెలుసా?
TeluguStop.com
క్యాప్సికమ్.అద్భుతమైన కూరగాయల్లో ఇది ఒకటి.
దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, కాపర్, ఫైబర్‌తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అందుకే క్యాప్సికమ్‌ను పోషకాల గని అని పిలుస్తుంటారు.అయితే ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను అందించే క్యాప్సికమ్.
హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టడానికి అద్భుతంగా సహాయ పడుతుంది.అవును, క్యాప్సికమ్‌ను ఇప్పుడు చెప్ప బోయే విధంగా వాడేస్తే స్త్రీలైనా, పురుషులైనా హెయిర్ ఫాల్ సమస్యకు స్వస్థి పలకొచ్చు.
మరి లేటెందుకు కేశాలకు క్యాప్సికమ్‌ను ఎలా వాడాలో తెలుసుకుందాం పదండీ.ముందుగా పెద్ద క్యాప్సికమ్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి.
తురుముకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మరో గిన్నె పెట్టి.ఒక కప్పు ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను పోయాలి.
ఇప్పుడు ఈ ఆయిల్‌లో ముందుగా తురిమి పెట్టుకున్న క్యాప్సికమ్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు హీట్ చేసి.
స్టవ్ ఆఫ్ చేయాలి. """/" /
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార బెట్టుకుని.
ఆయిల్‌ను మాత్రం ఫిల్టర్ చేసుకోవాలి.ఆపై ఆ ఆయిల్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి కనీసం రెండు గంటల పాటు వదిలేయాలి.
అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఇలా చేస్తే గనుక హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా తగ్గు ముఖం పడుతుంది.
కాబట్టి, జుట్టు అధికంగా రాలుతుంటే తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.
బాలయ్య వ్యక్తిత్వం గొప్పది.. డైరెక్టర్ బాబీ కామెంట్స్ వింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే!