Capsicum : క్యాప్సికం పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగించే నల్లబూజు తెగుల నివారణకు చర్యలు..!
TeluguStop.com
క్యాప్సికం పంట( Capsicum )ను ఆశించే నల్ల బూజు తెగులు కొన్ని రకాల చీడపీడల వల్ల పంటను ఆశిస్తుంది.
చీడపీడలు మొక్కలను తినే సమయంలో మొక్కలపై తేనె బంకను విసర్జిస్తాయి.ఈ తేనె బంక వల్ల నల్లబూజు తెగులు ఎదగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ఈ తేనే బంక ఇతర మొక్కలపై లేదంటే ఇతర మొక్కల ఆకులపై పడితే ఈ తెగుల వ్యాప్తి జరుగుతుంది.
చీడ పీడల ద్వారా, చీమల ద్వారా ఈ తెగులు సులభంగా ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాప్తి చెందుతాయి.
"""/"/
ఈ తెగుల వల్ల మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ( Photosynthesis ), వాతావరణం లోని వాయువులను మార్పిడి చేయడాన్ని అడ్డుకుంటాయి.
దీంతో ఆకులు రాలిపోవడం, చనిపోవడం జరుగుతుంది.మొక్క ఎదుగుదల తగ్గడంతో పాటు దిగుబడి, నాణ్యత తగ్గుతుంది.
ఈ తెగుళ్ల వల్ల క్యాప్సికం పంటకు నష్టం కలగకుండా ఉండాలంటే.మొక్కల మధ్య అధిక దూరం ఉండేలాగా నాటుకోవాలి.
సరిపడినంత సూర్యరశ్మి మొక్కలకు అందితే మొక్కలు ఆరోగ్యకరంగా పెరగడంతో పాటు పంటకు తెగులు ఆశించిన వ్యాప్తి తక్కువగా ఉంటుంది.
చెట్ల చుట్టూ భౌతిక అవరోధాలను నిర్మించడం వల్ల చీమలు లేదా చీడపీడల వల్ల ఒక మొక్క నుంచి మరొక మొక్కకు ఈ తెగులు వ్యాపించే అవకాశం ఉండదు.
"""/"/
సేంద్రియ పద్ధతిలో( Organic Farming ) ఈ తెగుళ్లను అరికట్టాలంటే.వేప నూనెను మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
తెల్ల దోమలు, చీమలు, పిండి నల్లులు లాంటివి వేప నూనెను తట్టుకోలేక చనిపోతాయి.
కీటక నాసిక సబ్బు ద్రావణం ను నీటిలో కలిపి పిచికారి చేయడం వల్ల నల్ల బూజు తొలగిపోతుంది.
ఇక రసాయన పిచికారి మందులను కచ్చితంగా ఉపయోగించాల్సిన పరిస్థితులు ఏర్పడితే.మలాథియాన్ లాంటి ఆర్గానోఫాస్ఫేట్ కుటుంబ జాతికి చెందిన రసాయనాలను ఉపయోగించాలి.
చేతివాటం చూపించిన జొమాటో డెలివరీ బాయ్.. వీడియో వైరల్..