Capsicum Crop : క్యాప్సికం పంట సాగులో ఎరువుల యాజమాన్యం.. దిగుబడి పెంచే మెళుకువలు..!
TeluguStop.com
క్యాప్సికం పంట( Capsicum )ను బయటి ప్రదేశంలో కాకుండా వెంటిలేటెడ్ పాలిహౌస్లలో అయితే సంవత్సరం పొడుగునా సాగు చేసి మంచి దిగుబడులు పొందవచ్చు.
మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు పాలిహౌస్లలో పూలకు బదులు క్యాప్సికం పంట సాగు చేసేందుకు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు.
కాబట్టి అధిక దిగుబడుల కోసం పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం.ఒక ఎకరం పొలంలో క్యాప్సికం పంటను సాగు చేస్తే.
ఆరు ట్రాక్టర్ల పశువుల ఎరువు, రెండు టన్నుల వరి ఊక కలిపి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
క్యాప్సికం పంట సాగు చేసే నేలలో భూసార పరీక్ష చేపించి, తక్కువగా ఉండే పోషక ఎరువులు నేలకు అందించాలి.
నేల యొక్క పీహెచ్ విలువ 6-6.5( PH Value ) మధ్య ఉంటే పంటకు చాలా అనుకూలం.
విద్యుత్ చాక్ కల్ 0.75 డెసిమోస్ ఉన్న మట్టిని మాత్రమే వినియోగించాలి.
ఆఖరి దుక్కిలో 200 కిలోల సూపర్ ఫాస్ఫేట్ ఎరువులు వేసుకోవాలి. """/"/
ఇక క్యాప్సికం పంటను సాగు చేసే బెడ్ల తయారీ విషయానికి వస్తే.
బెడ్డు ఎత్తు 25 సెంటీమీటర్లు, వెడల్పు 80 సెంటీ మీటర్లు, బెడ్ల మధ్య దూరం 40 సెంటీమీటర్లు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి.
ఆ తర్వాత ప్రతి 10 చదరపు మీటర్లకు 50 కేజీల వేప చెక్క 20 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్( Magnesium Sulphate ) మందు కలిపి చల్లుకోవాలి.
జూన్ లేదా జూలై నెలలో నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటుకోవాలి.మొక్క నాటిన తర్వాత ప్రతి మొక్క మొదల వద్ద 25 మి.
లీ కార్బండిజం ద్రావణంను పోయాలి. """/"/ క్యాప్సికం పంటకు డ్రిప్ విధానం( Drip System ) ద్వారానే నీటిని అందించాలి.
విత్తనాలు మొలకెత్తిన తర్వాత 15 రోజులకు ఏపుగా పెరగని మొక్కలను గుర్తించి వాటిని తీసేసి వాటి స్థానంలో బాగా పెరిగే మొక్కలను నాటుకోవాలి.
ఇక పొలంలో కలుపు సమస్య లేకుండా పంటను సంరక్షించుకుంటే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడి పొందవచ్చు.
చేతివాటం చూపించిన జొమాటో డెలివరీ బాయ్.. వీడియో వైరల్..