అమరావతే రాజధాని..: చంద్రబాబు

అమరావతే( Amaravati ) రాజధాని అని తాను, జనసేనాని పవన్ కల్యాణ్ హామీ ఇస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

అమరావతి నుంచి పేదల పాలన ప్రారంభం అవుతుందని తెలిపారు.దేవతల రాజధానిని రాక్షసులు పాలిస్తున్నారని చంద్రబాబు( Chandrababu Naidu ) విమర్శించారు.

85 రోజుల కౌంట్ డౌన్ ను అమరావతిలో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.వైసీపీ విముక్త రాష్ట్రం నుంచి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

యువతకు ఉపాధి కల్పించే బాధ్యత కూడా తామేనని తెలిపారు.అలాగే విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

పుష్పరాజ్ లాంటి వ్యక్తులు బయట కూడా ఉన్నారు.. రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!