BRS MLA Lasya Nandita : రోడ్డుప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
TeluguStop.com
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( Lasya Nandita ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
పటాన్ చెరు దగ్గర సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
లారీని ఢీకొన్న ఎమ్మెల్యే కారు అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యనందిత అక్కడికక్కడే మృతిచెందారు.
కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.ఆయనను మియాపూర్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
"""/" /
ప్రస్తుతం లాస్య నందిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి( Gandhi Hospital ) తరలించారు.
పోస్టుమార్టం అనంతరం లాస్య నందిత పార్థివదేహాన్ని కంటోన్మెంట్ నివాసానికి తరలించనున్నారు.ఇప్పటికే ఆమె మరణవార్త తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకుంటున్నారు.
మరోవైపు లాస్య మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.
ఎమ్మెల్యే లాస్య నందిత దివంగత నేత సాయన్న( Sayanna ) కుమార్తె.ఆయన గతేడాది ఫిబ్రవరి 19న అనారోగ్యంతో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ను డామినేట్ చేస్తాడా..?