టీడీపీ సింగిల్‎గా పోటీ చేయొచ్చు కదా.?: బాలినేని

నకిలీ స్టాంపులు, భూ కబ్జాల విషయంలో దర్యాప్తు కోసం సిట్ వేశామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు.

ఈ మేరకు సిట్ రిపోర్ట్ కూడా రెడీ అవుతోందని తెలిపారు.ఈ క్రమంలోనే నిందితులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని మాజీమంత్రి బాలినేని పేర్కొన్నారు.

టీడీపీ సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు.పొత్తు లేకుండా ముందుకు వెళ్లలేని పరిస్థితి టీడీపీదని విమర్శించారు.

చంద్రబాబు విషయంలో టీడీపీ నేతలు నానా యాగి చేస్తున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో చంద్రబాబును ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం వైసీపీకి లేదని వెల్లడించారు.