నీ సైజు ప్యాంటు దొరకలేదా పూజ… పూజా హెగ్డే డ్రెస్ పై భారీ ట్రోల్స్!

పూజా హెగ్డే(Pooja Hedge) సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు.తెలుగు సినిమాతో పాటు తమిళ హిందీ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.

బుట్ట బొమ్మగా తెలుగు ప్రేక్షకులనుపెద్ద ఎత్తున సందడి చేసిన పూజా హెగ్డే కు ఈమధ్య కాలంలో పెద్దగా సినిమాలు కలిసి రాలేదని తెలుస్తోంది.

గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజా హెగ్డే నాలుగు సినిమాల ద్వారా చేదు ఫలితాలు ఎదుర్కొన్నారు.

ఇలా తెలుగులో ఇతర భాషలలో ఈమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినప్పటికీ ఈమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తుంది.

"""/" / ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్(Salman Khan) సరసన సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దీనితోపాటు త్రివిక్రమ్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా పూజా హెగ్డే నటిస్తున్నారు.

ఇలా పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇక తనకు షూటింగ్ సమయంలో విరామం దొరికిన ప్రతిసారి వెకేషన్ వెళ్తూ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తుంటారు.

"""/" / తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు.

ఈ ఫోటోలో తన ప్యాంటు చాలా వదులుగా ఉన్నప్పటికీ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.

అయితే ఈ ఫోటో పై కొందరు నెట్టిజెన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఏంటి పూజ నీ సైజు ప్యాంటు దొరకలేదా.

ఇలాంటిది కొన్నావ్ అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటో పై కామెంట్లు చేస్తున్నారు.

ఇక గత ఏడాది వరస ఫ్లాప్ సినిమాలను మూటగట్టుకున్న ఈ బుట్ట బొమ్మకు ఈ ఎడాదైనా అదృష్టం కలిసి వస్తుందా.

లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

రోజూ ఈ జ్యూస్ తాగండి.. నాజూగ్గా మారండి..!