విమాన టికెట్లు కొనలేం.. ఇక్కడ వుండలేం: ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్ధుల ఇక్కట్లు
TeluguStop.com

రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి.


ఉక్రెయిన్‌ని ఉన్నపళంగా ఖాళీ చేసి రావాలంటూ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి.భారత ప్రభుత్వం కూడా ఇదే బాటలో పయనించింది.


కీవ్‌లోని ఇండియన్ ఎంబసీ ఈ మేరకు నిన్న ఆదేశాలు జారీ చేసింది.అయితే యుద్ధ భయాల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అన్ని దేశాలు విమాన సర్వీసులు నిలిపి వేశాయి.
వున్న అరకొర సర్వీసులకు సైతం భారీ డిమాండ్ నెలకొంది.టికెట్ల రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ స్థాయిలో టికెట్లు కొనగలిగే స్థోమత తమకు లేదంటూ భారతీయ విద్యార్ధులు వాపోతున్నారు.
తమ దుస్థితిని సోషల్ మీడియా ద్వారా భారతీయ ప్రజా ప్రతినిధులకు , జాతీయ మీడియా సంస్థలకు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో పలువురు భారతీయ విద్యార్ధులు.ఒక జాతీయ మీడియా సంస్థతో వీడియో కాల్ ద్వారా ఉక్రెయిన్ పరిస్ధితిని వివరించారు.
హర్ష్ గోయల్ అనే విద్యార్ధి మాట్లాడుతూ.ఇక్కడ పరిస్ధితి ఉద్రిక్తంగానే వుందన్నారు.
కొందరు విద్యార్ధులు ఉక్రెయిన్‌ను వీడేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారని, కానీ ఆ సర్వీసులు రద్దయ్యాయని హర్ష్ చెప్పారు.
తమను తక్షణం ఖాళీ చేసి రమ్మంటున్నారని.కానీ టికెట్ ధరలు చాలా ఎక్కువగా వున్నాయని హర్ష్ గోయల్ చెప్పారు.
ఈ స్థాయిలో టికెట్‌లను కొనుగోలు చేసే శక్తి అందరికీ లేదని ఆయన వాపోయారు.
తాము ఈ మెయిల్, కాల్‌ల ద్వారా ఎంబసీతో నిరంతరం టచ్‌లోనే వున్నామని హర్ష్ గోయల్ పేర్కొన్నారు.
మరో విద్యార్ధి ఆశిష్ గిరి మాట్లాడుతూ.ఉక్రెయిన్ పరిస్ధితుల గురించి తెలుసుకున్న తమ కుటుంబం చాలా ఆందోళన చెందుతోందన్నారు.
తిరిగి భారత్‌కు వచ్చేద్దామంటే ఫిబ్రవరి 20 వరకు టికెట్లు అందుబాటులో లేవని, కొన్ని టికెట్లు వున్నా వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయని ఆశిష్ చెప్పారు.
"""/" /
మరోవైపు ఉక్రెయిన్ పరిస్థితిపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖీ మీడియాతో మాట్లాడారు.
ఉక్రెయిన్‌లో నివసించే భారతీయులకు అండగా వుంటామని.వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తామని ఆమె తెలిపారు.
మా హాట్ లైన్స్, ఈ మెయిల్స్ అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయని.దేశాన్ని వీడటంతో సహా ఇతర సహాయ సహకారాలు అందజేస్తామని మీనాక్షీ చెప్పారు.
లాక్‌డౌన్ సమయంలో విదేశాల్లో ఉన్నవారిని తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో.
అదే స్థాయిలో వ్యవహరిస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఛావా మూవీ క్రియేట్ చేసిన 8 క్రేజీ రికార్డులు ఇవే.. ఇప్పట్లో ఈ రికార్డ్స్ బ్రేక్ అవుతాయా?