గంజాయి లేని నల్లగొండే నా లక్ష్యం: కలెక్టర్ నారాయణరెడ్డి

నల్లగొండ జిల్లా: గంజాయిపై సమరంలో చేయిచేయి కలుపుదాం సమూలంగా నిర్మూలిద్దామని నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

గంజాయిపై యుద్ధం చేద్దాం,నల్లగొండ నుంచి మత్తును తరిమేద్దామని,యువత భవితను చిత్తు చేస్తున్న గంజాయిని తరిమికొడదామని,రండి, కదలిరండి,కలిసిరండి అంటూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

గంజాయి, డ్రగ్స్ పై సమరం మన ముందున్న తక్షణ కర్తవ్యమని, రండి చేయిచేయి కలపండని, గంజాయిని తేవొద్దని, అమ్మొద్దని,వాడొద్దని,జీవితాలు నాశనం చేసుకోవద్దని,ఇదే మన పంతం,ఇదే మన శపధం అన్నారు.

గంజాయి,డ్రగ్స్ అంతంపై కావాలి మన అందరి పంతం,చేయాలి మనమంతా శపధం అన్నారు.గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిన టోల్ ఫ్రీ నెంబర్: 8712670266 కు సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచబడుతాయన్నారు.

జమిలి ఎన్నికలు ఖాయం .. చంద్రబాబూ సిద్ధం